వాట్ యాన్ ఐడియా స‌ర్ జీ.. కాపునేస్తం పై వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ సెటైర్లు!

Update: 2022-07-30 06:38 GMT
గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఎంపీగా గెలుపొందారు.. ర‌ఘురామకృష్ణ‌రాజు. ఆ త‌ర్వాత కొద్ది కాలానికే ఆ పార్టీతో విభేదించారు. ప్ర‌భుత్వ విధానాల‌ను ఆయ‌న త‌ర‌చూ త‌ప్పుబ‌డుతున్నారు. ఇందుకోసం సోష‌ల్ మీడియా, యూట్యూబ్ చానెళ్లు, వివిధ న్యూస్ చానెళ్ల‌కు ఆయ‌న ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు.

తాజాగా కాకినాడ జిల్లా గొల్ల‌ప్రోలులో జ‌రిగిన వైఎస్సార్ కాపు నేస్తం కార్య‌క్ర‌మంపై ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. మ‌రోసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుని సెటైరు వేశారు. వాట్ యాన్ ఐడియా స‌ర్ జీ అంటూ సెటైర్ల‌తో చెల‌రేగారు.

కాపు నేస్తం కార్య‌క్ర‌మానికి.. థాంక్యూ సీఎం సార్.. అంటూ ఫ్ల‌కార్డులు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. స‌చివాల‌య ఉద్యోగులు త‌మ‌కు ప్రొబేష‌న్ ఇచ్చినందుకు సీఎం వైఎస్ జ‌గ‌న్ కు ధ‌న్య‌వాదాలు చెప్ప‌డానికి థాంక్యూ సీఎం సార్ అంటూ ఫ్ల‌కార్డులు తెచ్చి చూపారు. అయితే సభలో ఈ ప్లకార్డుల్ని కుర్చీల్లో ఉంచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోను ప్రస్తావిస్తూ రఘురామ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

ఇప్పుడు ఈ ఫ్ల‌కార్డుల‌పైనే ఎంపీ ర‌ఘురామ సెటైర్లు పేల్చారు. ‘వాట్ యాన్ ఐడియా సర్ జీ.. ఈ ఫోటోను చూసిన తర్వాత కాపు నేస్తం కార్యక్రమానికి వచ్చినవారంతా స్వచ్ఛందంగా ఈ ప్లకార్డులు తీసుకుని వచ్చారని అనుకున్నాను. కనీసం మా పార్టీ వాలంటీర్లు ప్ర‌జ‌ల‌ను బస్సుల్లో త‌ర‌లించిన‌ప్పుడే ఈ ప్లకార్డులను ప్రజలకు అందజేసి ఉంటే వారి తెలివితేటలు ఫ‌లించేవి’ అంటూ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఎద్దేవా చేశారు.

ఆ ఫ్ల‌కార్డుల‌ను ప్ర‌జ‌ల‌ను స్వ‌చ్ఛందంగా తీసుకురాలేద‌ని.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే వ‌లంటీర్ల‌తో తెప్పించి భ‌జ‌న కొట్టించుకుంటోంది అనేది ఎంపీ ర‌ఘురామ అభిప్రాయంగా ఉంద‌ని అంటున్నారు. అలాగే కాపునేస్తం కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన జ‌నాన్ని కూడా బ‌స్సుల్లో త‌ర‌లించార‌ని చెప్ప‌డం.. జ‌నం కూడా స్వ‌చ్ఛంధంగా రాలేద‌ని పేర్కొన‌డం ఎంపీ ఉద్దేశ‌మ‌ని చెబుతున్నారు. ఆ జ‌నాన్ని త‌ర‌లించ‌డం కోసం వ‌లంటీర్ల‌ను వినియోగించుకున్నార‌ని ర‌ఘురామ అంటున్నారు.
Tags:    

Similar News