ఏపీలో కాంగ్రెస్ పాపాల‌ను ఆయ‌న శుద్ధి చేస్తాడా

Update: 2015-08-11 14:23 GMT
ఏపీ విభ‌జ‌న కాంగ్రెస్‌ ను ఎంత దెబ్బ‌కొట్టిందంటే ఏపీలో ఆ పార్టీ ఎప్ప‌టికి కోలుకుంటుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితికి దిగ‌జారిపోయింది. ఆరేడు ద‌శాబ్దాలుగా అధికార‌, ప్ర‌తిప‌క్షంలో ఉండి బ‌లంగా వేళ్లూనుకున్న కాంగ్రెస్ చేసిన ఈ పాపానికి అథః పాతాళంలోకి దిగ‌జారిపోయి... క‌నీసం నాయ‌కులు కాదు క‌దా కార్య‌క‌ర్త‌లు, ఓట‌ర్లు లేని స్థితికి చేరింది. కాంగ్రెస్ ఏపీ ప్ర‌జ‌ల‌కు చేసిన ఈ అన్యాయం ఎన్న‌టికీ తీర‌నిది.  కాంగ్రెస్ ఏపీ కోసం ఏ స్థాయిలో పోరాడినా కూడా ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆ పార్టీని క‌రుణిస్తారో..అది ఎప్ప‌ట‌కి జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

  ఇన్ని క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్‌కు ఏపీ పీసీసీ అధ్య‌క్షుడిగా ర‌ఘువీరారెడ్డి ఉన్నారు. ఏపీ పీసీసీకి ఏ ఆబ్లిగేషన్ లేదు కాబట్టి గట్టిగా  ప్ర్య‌తేక హోదా పై పోరాడాలి. పోరాడే అవకాశం కూడా ఉంది. హోదాపై పోరాడినంత మాత్రాన వారికి ఏపీలో స్థానం ఉంటుందని కాదు.. కేవలం విభజన పాపం మాత్రమే పోతుంది. అది జ‌ర‌గాలన్నా కూడా ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ ఉద్య‌మాన్ని ఓవ‌రాల్‌ గా కాంగ్రెస్సే లీడ్ చేసే స్థాయిలో ఉండాలి. ఇప్పుడున్న ప‌రిస్థితులు చూస్తే అది అసాధ్యం.

అయితే కాస్తో కూస్తో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను  అనుకూలంగా చేసుకున్న కాంగ్రెస్ నాయ‌కులు నాలుగు మాట‌లు మాట్లాడుతున్నారు. ర‌ఘువీరారెడ్డి తాజాగా గ‌తంలో 11 రాష్ర్టాలు కేబినెట్ తీర్మానం ద్వారా స్పెష‌ల్ స్టేట‌స్ పొందిన విష‌యాన్ని బీజేపీ మ‌ర‌చి కేవ‌లం ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ విష‌యంలో ఎందుకు అభ్యంత‌రం చెపుతోంద‌ని గట్టి లాజిక్ తీస్తున్నారు.

ఇక జ‌గ‌న్ ఢిల్లీలో చేసిన దీక్ష పెద్ద డ్రామా అని వ‌ర్ణించిన ఆయ‌న మోదీని ప్ర‌శ్నించే ధైర్యం లేక అక్క‌డ ఒక్క మాట మాట్లాడ‌కుండా వెన‌క్కి తిరిగి వ‌చ్చేశార‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్రం వెంట‌నే ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే ఈ నెల 13 నుంచి రాష్ర్టంలోని అన్ని పోలీస్‌ స్టేష‌న్ల‌ లో ప్రధాని మోదీ, సీఎం చంద్ర‌బాబు, కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడిపై కేసులు పెడ‌తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మొత్తానికి ర‌ఘువీరా విభ‌జ‌న పాపం మోస్తున్న కాంగ్రెస్ పాపాల‌ను ఎంత వ‌ర‌కు శుద్ధి చేస్తారో చూడాలి.
Tags:    

Similar News