ప‌వ‌న్‌ ఫోనెత్తాడు!.. కానీ రాన‌న్నాడు!

Update: 2018-02-15 09:28 GMT
ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ఎవ‌రిది త‌ప్పో - ఎవ‌రిది ఒప్పో తేల్చేందుకంటూ జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ క‌మిటీ (జేఎఫ్‌ సీ) ఏర్పాటు చేసిన టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ పోరాటానికే తెర తీసిన‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ఈ విష‌యంలో తానొక్క‌డినే పోరాడితే ఫ‌లితం ఉండ‌ద‌నుకున్నారో - ఏమో తెలియ‌దు గానీ... అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌ను క‌లుపుకుని ముందుకు సాగాల‌ని భావిస్తున్న ప‌వ‌న్‌... ఇప్ప‌టికే సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - మాజీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ - లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌ - వామ‌ఫ‌క్షాల‌తో ఇప్ప‌టికే మాట్లాడేసి వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేసుకున్నారు. ఇక అధికారంలో టీడీపీ ఉంది క‌నుక ఆ పార్టీ మ‌ద్ద‌తు కోరే ప్ర‌సక్తే లేదు. అదే స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదానే కావాలంటూ ఆది నుంచి పోరు సాగిస్తున్న విప‌క్ష వైసీపీ మ‌ద్ద‌తును ప‌వ‌న్ ఇప్ప‌టిదాకా కోర‌నే లేదు. అంటే వైసీపీ మ‌ద్ద‌తు ఆయ‌న పోరాటానికి అవ‌స‌రం లేద‌ని భావించారో - ఏమో తెలియ‌దు గానీ... ఇప్ప‌టిదాకా ఆయ‌న నోట వైసీపీ మాట వినిపించ‌లేద‌నే చెప్పాలి.

ఇక తెలుగు నేల‌ను రెండు రాష్ట్రాలుగా విభ‌జించిన కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు త‌న పోరాటానికి అవ‌స‌ర‌మ‌ని భావించిన ప‌వ‌న్‌... ఆ పార్టీ మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే విష‌యంలో ఇప్ప‌టికే ఇబ్బందులు ప‌డ్డార‌ని చెప్పాలి. మొన్న‌టికి మొన్న నేరుగా ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డికి ఫోన్ చేస్తే.. ప‌వ‌న్ నెంబ‌ర్ చూసి కూడా ర‌ఘువీరా ఫోన్ లిఫ్ట్ చేయ‌లేద‌ట‌. అయితే అప్ప‌టికీ శాంతించ‌ని ప‌వ‌న్‌... ర‌ఘువీరా స‌తీమ‌ణి సునీత‌కు ఫోన్ చేసి అస‌లు విష‌యం చెప్ప‌గ‌లిగారు. అయినా అప్ప‌టిక‌ప్పుడు మాట్లాడేందుకు స‌సేమిరా అన్న ర‌ఘువీరా... ప‌వ‌న్ ఫోన్‌ ను చాలా లైట్ తీసుకున్నారు. జేఎఫ్‌ సీ ద్వారా చేసే పోరును ముందుకు తీసుకెళ్లాల్సిందేన‌న్న బ‌ల‌మైన కోరిక‌తో ఉన్న ప‌వ‌న్‌... ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా మ‌రోమారు ర‌ఘువీరాకు కాల్ క‌లిపార‌ట‌. అయితే రెండో సారి కూడా ప‌వ‌న్ ఫోన్‌ ను లిఫ్ట్ చేయ‌క‌పోతే బాగుండ‌దేమోన‌న్న భావ‌న‌తో ఈ సారి ర‌ఘువీరా కాస్తంత సానుకూలంగానే స్పందించార‌ట‌.

ప‌వ‌న్ కాల్ లిఫ్ట్ చేసిన ర‌ఘువీరా... జేఎఫ్‌ సీ పోరుకు పార్టీగా కాంగ్రెస్ మ‌ద్ద‌తు ప‌లుకుతుంద‌ని ప‌వ‌న్‌ కు ఓ మంచి క‌బురు చెప్పిన ర‌ఘువీరా.. ఆ వెంట‌నే ప‌వ‌న్‌ కు గూబ గుయ్యిమ‌నేలా షాకిచ్చార‌ట‌. జేఎఫ్‌ సీకి పార్టీ ప‌రంగా కాంగ్రెస్ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నా... తాను స్వ‌యంగా రాలేన‌ని ర‌ఘువీరా... ప‌వ‌న్‌ కు ముఖం మీదే చెప్పేశార‌ట‌. దీంతో ఎలా స్పందించాలో తెలియ‌క ప‌వ‌న్ తిక‌మ‌క ప‌డుతుంటే మ‌ళ్లీ తానే అందుకున్న తాను రాక‌పోయినా... కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు -  ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జంగా గౌతమ్ లను పంపుతానని పవన్ కు రఘువీరారెడ్డి వెల్లడించార‌ట‌. తాను చేప‌డుతున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తు అంటూనే ర‌ఘువీరా రాలేన‌ని ముఖం మీదే చెప్పేసినా... కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మ‌ద్ద‌తు ల‌భించిందిలే అన్న కోణంలో ఆలోచించిన ప‌వ‌న్ స‌రేన‌న త‌ప్ప‌లేద‌ట‌. మొత్తంగా రెండు ప‌ర్యాయాలు ఫోన్ చేయించుకున్న ర‌ఘువీరా.. చివ‌ర‌కు ప‌వ‌న్‌ కు సంతోషం క‌లిగేలా మాత్రం వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News