ఆ నేత బ్రేస్ లెట్ ఇచ్చేయ‌మ‌న్న రాహుల్‌

Update: 2017-06-02 14:21 GMT
కాంగ్రెస్ యువ‌రాజు.. ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తాజా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర అంశాల‌కు కొర‌త లేద‌ని చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వానికి రోజు ముందు వ‌చ్చిన ఆయ‌న‌.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారుపై ఫైర్ కావ‌టం.. ఇదేనా బంగారు తెలంగాణ‌? అంటూ కేసీఆర్ పాల‌న‌ను ప్ర‌శ్నించ‌టం తెలిసిందే.

రాహుల్ నుంచి ఇంత ఘాటు విమ‌ర్శ‌ను ఊహించ‌లేదేమో కానీ.. ఆయ‌న మాట‌ల‌కు టీఆర్ ఎస్ నేత‌ల్లో ఒకింత క‌ల‌వ‌రం మొద‌లైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ రియాక్ట్ అవుతూ.. రాహుల్ విమ‌ర్శ‌ల‌న్నీ స్థానిక నేత‌ల ఫీడ్‌ బ్యాక్ తో చేసిన‌వేన‌ని.. త‌యారు చేసిన ప్ర‌సంగ పాఠాన్ని చ‌దివారంటూ ఎద్దేవా చేశారు.

ఈ రాజ‌కీయ ముచ్చ‌ట్ల‌ను ప‌క్క‌న పెడితే.. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన స‌భ‌ను చూసిన రాహుల్ సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఆశించినంత భారీగా స‌భ‌ను ఏర్పాటు చేయ‌టంలో జ‌గ్గారెడ్డి పాత్ర కీల‌క‌మైన‌ద‌ని వీహెచ్ రాహుల్ ను వ్యాఖ్యానించారు. జ‌గ్గారెడ్డి గ‌ట్టోడు.. మొండోడు.. వ‌న్ మ్యాన్ షో చేసిండు అని చెబుతూ.. కోట్ల రూపాయిల్ని సొంతంగా ఖ‌ర్చు పెట్టుకొని ఇదంతా చేశాడంటూ వీహెచ్ పొగిడేశారు. మ‌ధ్యలో రాహుల్ క‌ల్పించుకుని.. మ‌రి స‌భ కోసం మీరేం ఇచ్చారంటూ వీహెచ్ పై చుర‌కేశారు. నా ద‌గ్గ‌రేముందంటూ వీహెచ్ వ్యాఖ్యానించ‌గా.. ఆయ‌న చేతికున్న బ్రేస్ లెట్ ను చూపించి ఇది ఇవ్వొచ్చుగా అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్య‌... వీహెచ్ తో స‌హా అందరినీ న‌వ్వించింది. రాహుల్ సునిశిత ప‌రిశీల‌న‌ను కాంగ్రెస్ నేత‌లు ప‌దే ప‌దే గుర్తు చేసుకోవ‌టం క‌నిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News