నిజాయితీపై రాహుల్ క్లాస్ అదిరిందిగా

Update: 2017-09-27 08:45 GMT
దాదాపు ప‌దేళ్ల‌పాటు వ‌రుస‌పెట్టి దేశాన్ని పాలించి 2-జీ - బొగ్గు స‌హా అనేక కుంభ‌కోణాల్లో మునిగితేలిన అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్‌ కు ఉపాధ్య‌క్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ నిజాయితీపై క్లాస్ పీకారు. వినేందుకు కొంత విచిత్రంగా - ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. నిజం! తాజాగా గుజ‌రాత్‌ లో ప‌ర్య‌టిస్తున్న రాహుల్ రైతుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. వారికి మోదీ పాల‌న‌లోని వైఫ‌ల్యాను వివ‌రిస్తున్నారు.  ఈ క్ర‌మంలోనే తాజాగా నిజాయితీ గురించి మాట్లాడారు. ఆయ‌నేమ‌న్నారంటే.. నిజాయితీ పరుడైన రాజకీయ నాయకులే అందరికంటే ఎక్కువగా కష్టాలు ఎదుర్కొంటారని  సెల‌విచ్చారు.

 ``నిజాయితీగల రాజకీయ నేతగా ఉండటమే భారత్‌ లో అత్యంత కష్టమైన పని. నిజాయితీ ఉంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వయంగా నేను అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను.  మేం అధికారంలోకి వస్తే రైతులు, ఇతర బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాలు ప్రవేశపెడతాం. ఇంకా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ విఫలమైంది. సామాన్య ప్రజలను పక్కనపెట్టి.. ధనిక వర్గాల కోసం బీజేపీ పాకులాడుతోంది. కేవలం ప్రసంగాలకే బీజేపీ నేతలు పరిమితమయ్యారంటూ' రాహుల్ ప్ర‌సంగించారు.

అయితే, నిజాయితీ స‌బ్జెక్ట్‌ ను ఎంచుకున్న రాహుల‌కు అనేక ప్ర‌శ్న‌లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటిలో ప్ర‌ధాన‌మైంది .. సొంత బావ.. వాద్రా భూకుంభ‌కోణంలో ఇరుక్కోవ‌డం. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌ లో ఈ కేసు విచార‌ణలో ఉంది. ఆయ‌నపై సిట్‌ కూడా వేశారు. అదేవిధంగా కాంగ్రెస్ హ‌యాంలో ఆర్థిక మంత్రిగా చేసిన చిదంబ‌రం త‌న‌యుడు కార్తీకి కూడా 2జీ కుంభ‌కోణంలో పాత్ర ఉంద‌ని వెలుగు చూడ‌డం. ప్ర‌స్తుతం ఇది కూడా సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. మ‌రి ఇన్ని మ‌చ్చ‌లు పెట్టుకుని రాజ‌కీయంగా నిజాయితీ ప‌రుల‌కు క‌ష్ట‌మ‌ని సెల‌వివ్వ‌డం ఈ యువ‌రాజా వారికే చెల్లింద‌ని విమ‌ర్శ‌కులు నోళ్లు వెళ్ల‌బెడుతున్నారు.  ఇటీవ‌ల కాలంలో రాహుల్ ఏం మాట్లాడుతున్నారో అస్స‌లు ఆయ‌న‌కైనా అర్ధం అవుతోందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇట‌వ‌ల అమెరికా ప‌ర్య‌ట‌న‌లో గాంధీ - నెహ్రూలు ఎన్ ఆర్ ఐ లంటూ - ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్‌ కు లింకు తెగిందంటూ కామెంట్లు చేశారు. మ‌రి ఇలా అయితే ఎలా రాహుల్ అంటున్నారు విమ‌ర్శ‌కులు!!
Tags:    

Similar News