ఆయన భారతీయుడు సినిమా తీశారు. సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆయనే విశ్వ విఖ్యాత నటుడు కమల్ హాసన్. ఆయన తమిళనాడులో ఒక రాజకీయ పార్టీని స్థాపించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జనాలు అయితే ఆదరించలేదు. అయినా కమల్ నిరుత్సాహపడలేదు. తనలో రాజకీయ యావ ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదని సమయం సందర్భం వచ్చినపుడల్లా కమల్ హాసన్ రుజువు చేసుకుంటూనే ఉన్నారు.
ఇక కమల్ హాసన్ తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో చేస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరచారు. ఎందుకంటే కమల్ కాంగ్రెస్ పార్టీ కాదు, పైగా ఆయనకు ఒక పార్టీ ఉంది. అయినా సరే ఆయన రాహుల్ తో కలసి అడుగులు వేశారు. హుషార్ చేశారు.
దీంతో రాహుల్ జీ కూడా సంతోషపడ్డారు. ఒక ప్రముఖ సెలిబ్రిటీ రాజకీయ పార్టీ నేత తనతో కలసి వచ్చి మద్దతు ఇవ్వడం అంటే రాహుల్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా కమల్ హాసన్ చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం సంచలనం గానే ఉన్నాయి. తాను రాహుల్ పాదయాత్రలో ఒక భారతీయుడిగా పాలుపంచుకుంటున్నాను అని కమల్ చెప్పారు.
తాను సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని స్థాపించాను అని కమల్ చెప్పారు. తన పార్టీ సంగతి ఎలా ఉన్నా ఇపుడు దేశం కోసం అంతా కలవాలని కమల్ హాసన్ అనడం విశేషం. భారతదేశం కోసం భారతీయులు అంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపు ఇచ్చార్.
ఇక్కడే ఒక డౌట్ వస్తోంది. కమల్ హాసన్ పార్టీ వేరు అయినా ఆయన కాంగ్రెస్ కి జై అంటున్నారు. తమిళనాడులో చూస్తే డీఎంకే అధికారంలో ఉంది. ఆ పార్టీ కాంగ్రెస్ కి మిత్ర పక్షమే. ఇపుడు కమల్ మిత్రపక్షమవుతారా లేక రేపటి ఎన్నికలలోగా ఆయన కాంగ్రెస్ లో చేరుతారా అన్న చర్చ నడుస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే మాత్రం రాహుల్ గాంధీకి కమల్ మద్దతు ప్రకటించడం అంటే కచ్చితంగా యాంటీ మోడీ స్టాండ్ గానే చూడాలి. వామపక్ష భావజాలం నిండా ఉన్న కమల్ మోడీని ఎపుడూ సపోర్ట్ చేయలేదు. చేయబోరు కూడా. ఇక ఆయన మరో మాట అంటున్నారు. దేశం కోసం అంతా కలవాలని, దాన్ని కాస్తా వేరే సౌండ్ తో అర్ధం చేసుకుంటే మోడీకి యాంటీగా అంతా కలవాలనే వస్తుంది.
అంటే యాంటీ మోడీ క్యాంపు కి కానీ కూటమికి కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన వేదిక అని ఈ ప్రముఖ నటుడు చెప్పదలచుకున్నారా అన్నదే కీలకమైన మౌలికమైన ప్రశ్న. ఒక విధంగా దేశంలో నాన్ బీజేపీ పార్టీలకు తటస్థంగా ఉన్న పార్టీలకు కమల్ సందేశం ఇస్తున్నట్లుగానే ఉంది అంటున్నారు. రేపటి ఎన్నికల్లో రాహుల్ మోడీకి తురుగులేని ప్రత్యర్ధి అని కమల్ లాంటి వారు భావిస్తున్నారు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.