యుద్ధం నల్లధనంపైనా.. పేదలపైనా?

Update: 2016-12-13 08:52 GMT
   
పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా ప్రధాని మోడీ పేదలపై యుద్ధం ప్రకటించారని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని దాద్రీలో పర్యటిస్తున్న ఆయన స్థానికులతో మాట్లాడుతూ మోడీ తీరుపై ఫైరయ్యారు.  పేద‌ల‌తో మాట్లాడి వారి కష్టాల‌ను గురించి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ...  ప్ర‌ధాని మోదీ దేశంలోని పేద ప్ర‌జ‌ల‌పై యుద్ధం ప్ర‌క‌టించార‌ని వ్యాఖ్యానించారు.
    
పెద్ద‌నోట్ల ర‌ద్దు ఉద్దేశాన్ని గురించి తెలుపుతూ మోదీ రోజుకో మాట‌ మాట్లాడుతున్నార‌ని రాహుల్ అన్నారు. మొద‌ట న‌ల్ల‌ధ‌నాన్ని - న‌కిలీ నోట్ల‌ను అరిక‌ట్టేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పార‌ని, ఆ తరువాత ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్ట‌డానికి అన్నార‌ని, ఇప్పుడు క్యాష్‌ లెస్ ట్రాన్సాక్ష‌న్స్ అంటున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.
    
మోదీ క్యాష్‌ లెస్ లావాదేవీల వైపుకు దేశాన్ని తీసుకువెళ‌తాన‌ని అంటున్నార‌ని, కానీ, ఇప్పటికే మోదీ తీసుకున్న నిర్ణ‌యంతో స‌మాజం క్యాష్‌ లెస్ స‌మాజంగా మారిపోయి క‌ష్టాల్లో ప‌డింద‌ని ఆయ‌న అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News