మోడీని ఫాలో అవుతున్న రాహుల్! సెంటిమెంటా?

Update: 2019-03-30 05:24 GMT
ఈ సారి ఎన్నికల్లో ఏదేమైనా రెండు చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నారట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఒకవైపు అమేథీ నుంచి పోటీ చేస్తూనే.. మరోవైపు దేశంలో మరో చోట నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నాడట కాంగ్రెస్ సుప్రిమో. ఆ విషయంలో పలు నియోజకవర్గాల పేర్లను పరిశీలిస్తూ ఉన్నారట రాహుల్ గాంధీ.  రాహుల్ వేసే రెండో నామినేషన్ దక్షిణ భారతదేశం నుంచినే అని మాత్రం స్పష్టం అవుతోంది.

అయితే ఇప్పుడు  సౌత్ లో కాంగ్రెస్ పార్టీ బాగా వీక్ అయ్యింది. గతంలో బాగా ఆదరించిన తెలుగు ప్రాంతం ఇప్పుడు కాంగ్రెస్ ను పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ఉన్నా.. గెలుపు ఈజీ కాదు!

ఇక కర్ణాటకలో కొంత అవకాశం ఉంది. అయితే రాహుల్ మాత్రం అక్కడ పోటీ చేయాలని అనుకోవడం లేదట. కేరళ నుంచి రాహుల్ నామినేషన్ దాఖలు చేయడం దాదాపు ఖరారు అయ్యిందని సమాచారం. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.  ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఎలాగూ రెండు చోట్ల గెలిచానా.. వెంటనే రాజీనామా చేయాల్సిందే. వయనాడ్ కే రాహుల్ రాజీనామా చేసే అవకాశాలున్నాయి.  అలాంటి నేపథ్యంలో.. ఇంతకీ ఎందుకు రాహుల్ ఇలా చేస్తున్నారు అంటే - బహుశా సెంటిమెంట్ ఏమో అంటున్నారు. గత ఎన్నికల్లో మోడీ వారణాసితో పాటు వడోదరలో కూడా పోటీ చేసి నెగ్గారు. ప్రధాని అయ్యారు. ఆ సెంటిమెంట్ కోసమే రాహుల్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారేమో అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
Tags:    

Similar News