రేవంత్ చేరిక‌లోనూ రాహుల్ బుక్క‌య్యారే!

Update: 2017-10-31 16:50 GMT
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు నిజంగానే బ్యాడ్ టైం వెంటాడుతున్న‌ట్లుగా ఉంది. గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో యూపీఏ ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన రాహుల్‌... గుజ‌రాత్ సీఎంగా ఉంటూనే ఎన్డీఏ ప్ర‌ధాన‌మంత్రి అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చిన న‌రేంద్ర మోదీ ముందు ప‌ల్టీ కొట్ట‌క త‌ప్ప‌లేదు. మోదీ హ‌వా ముందు రాహుల్ గాంధీ తేలిపోయారు. ఫ‌లితంగా అధికారం పోతే పోయింది... క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా సంపాదించుకునేంత స్థాయి సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ద‌క్క‌లేదు. ఈ త‌ర‌హా ఘోర ప‌రాజ‌యం రాహుల్ గాంధీ వ‌ల్లేన‌ని - ఆయ‌న చేత‌గాని త‌నం వ‌ల్లే పార్టీ ప‌రువు గంగ‌లో క‌లిసిపోయింద‌ని ఇటు విశ్లేష‌కుల‌తో పాటు అటు సొంత పార్టీ నేత‌ల నుంచి కూడా గుస‌గుస‌లు వినిపించాయి. అయినా ఇప్పుడేమైంద‌ని రాహుల్ గాంధీకి టైం బాగేలోద‌ని మ‌రోమారు గుర్తు చేసుకోవ‌డానికి అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినా... టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కొట్టిన దెబ్బ‌కు ఇప్ప‌టికీ టీ కాంగ్రెస్ కోలుకోలేదు. అదే స‌మ‌యంలో ఒక్క కాంగ్రెస్‌నే కాకుండా మిగిలిన రాజ‌కీయ ప‌క్షాలు కూడా లేకుండా చూడాల‌ని భావిస్తున్న కేసీఆర్‌... తెలంగాణ‌లో ఆయా పార్టీల భ‌ర‌తం ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో టీటీడీపీ కుంచించుకుపోగా... పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచిన రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు పార్టీ మారిపోయారు. రాజ‌కీయ వైరం నేప‌థ్యంలో ఎలాగూ టీఆర్ ఎస్‌ లో చేరే అవ‌కాశం లేని రేవంత్ రెడ్డి... స‌ర్వ‌సాధార‌ణంగానే కాంగ్రెస్ వైపు చూశారు. రేవంత్ లాంటి యంగ్ అండ్ డైన‌మిక్ నేత‌లు పార్టీలోకి వ‌స్తే... పార్టీకి కొత్త ఊపు ఖాయ‌మ‌న్న భావ‌న‌తో రాహుల్ గాంధీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఇంకేముంది నిన్న సాయంత్రం ఢిల్లీ ఫ్లైటెక్కిన రేవంత్ రెడ్డి... కాసేప‌టి క్రితం కాంగ్రెస్‌ లో చేరిపోయారు. స్వ‌యంగా రాహుల్ గాంధే... రేవంత్‌కు పార్టీ కండువా క‌ప్పి రెడ్ కార్పెట్ స్వాగ‌తం ప‌లికారు.

ఇదంతా బాగానే ఉన్నా... ఈ సంతోష స‌మ‌యాన రేవంత్ నోటిని తీపి చేయాల‌ని భావించిన రాహుల్ గాంధీ ఓ స్వీట్ బాక్సును తెప్పించారు. పార్టీ నేత‌ల సమ‌క్షంలోనే ఆ బాక్సులోని ఓ స్వీటును చేత‌బ‌ట్టుకుని దానిని నేరుగా రేవంత్ నోటికి అందించారు. ఈ ఫొటోను రేవంత్ త‌న ఫేస్ బుక్ అకౌంట్‌ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను చూసిన వారు రాహుల్ గాంధీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ... రేవంత్‌ ను అప్ర‌మ‌త్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయినా ఈ ఫొటోలో ఏముందంటారా?  సాధార‌ణంగా ఎవ‌రికైనా మ‌నం ఏదైనా తినిపించాలంటే ఏ చేతిని వాడ‌తాం?  కుడి చెయ్యినే క‌దా. మ‌రి రాహుల్ ఏ చెయ్యిని వాడారో తెలుసా? అంద‌రికంటే కాస్తంత భిన్నంగా వ్య‌వ‌హ‌రించే రాహుల్ గాంధీ.. రేవంత్ నోటికి స్వీటును అందించేందుకు కుడి చెయ్యి బ‌దులుగా ఎడ‌మ చెయ్యిని వాడారు. నిజ‌మా? అంటే... సాక్షాత్తు రేవంత్ రెడ్డి షేర్ చేసిన ఫొటోలో రాహుల్ గాంధీ ఎడ‌మ చేతితోనే స్వీటును రేవంత్ నోటికి అందిస్తున్నారు. దీనిపై సోష‌ల్ మీడియాలో అప్పుడే సెటైర్లు మొద‌లైపోయాయి.


Tags:    

Similar News