ఎంత కడుక్కున్నా పోని మరక మోడీపై రాఫెల్ ఎపిసోడ్‌లో పడినట్లే. తన లాంటి వీర నిజాయితీపరుడు లేడన్న మాటల్లో పస లేదన్న విషయాన్ని రాఫెల్ డీల్ తేల్చేసింది. మోడీ దేశభక్తి మాటలపై నమ్మకం కోల్పోయేలా చేసిన రాఫెల్ ఎపిసోడ్ లో తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సంధించిన హాల్ (హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) అస్త్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాఫెల్ ఇష్యూలో మోడీపైన పోరాటం చేస్తున్న రాహుల్ తాజాగా హెచ్ఏఎల్ (సింఫుల్ గా హాల్) సంస్థకు సంబంధించిన మాజీ ఉద్యోగులు.. నిపుణులు.. కార్మిక సంఘాల నేతలతో కలిసి బెంగళూరులోని ఆ సంస్థ కార్పొరేట్ ఆఫీసుకు ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రాఫెల్ డీల్ లో హాల్ స్థానే కేవలం 12 రోజుల వయసున్న అనిల్ అంబానీకి కంపెనీ డీల్ ఇవ్వటంపై వెల్లువెత్తుతున్న విమర్శల్ని మరింత పెంచేలా హాల్ మాజీ ఉద్యోగులు మండిపడ్డారు. దేశం కోసం 4,101 యుద్ధ విమానాల్ని తయారు చేసిన చరిత్ర హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అలియాస్ హాల్ కు ఉందన్నారు. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో పాటు.. అమెరికాను సైతం సవాల్ చేసే చరిత్ర సొంతమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
హాల్ లో పని చేసే వేలాది మంది నిపుణుల అవకాశాల్ని చిదిమేస్తూ.. 12 రోజుల ప్రైవేటు సంస్థకు రాఫెల్ తయారీ ఒప్పందాన్ని అప్పగించటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన సమావేశం హాల్ పాలక మండలికి వ్యతిరేకం ఎంత మాత్రం కాదని. కేంద్ర ప్రభుత్వ తీరుకు మాత్రమే వ్యతిరేకమని పలువురు వ్యక్తం స్పష్టం చేస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారుచేసే సామర్థ్యం యూపీఏ ప్రభుత్వం తీర్మానిస్తే.. తాజాగా అలాంటి సామర్థ్యం హాల్ కు లేదన్న మాటలు తమను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాల్ మాజీ ఉద్యోగుల వ్యాఖ్యలతో మోడీ సర్కారు ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసేలా రాహుల్ చేసిన ప్రయత్నంతో కమలనాథులు మరింత కలవరపడిపోతున్న పరిస్థితి.