నవ్వు నాలుగు విధాల చేటు అని పెద్దోళ్లు ఊరికే చెప్పలేదు. సమయం సందర్భం లేకుండా ఉత్తినే నవ్వితే దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. నవ్వరాని వేళ.. ముఖం మీద నవ్వు వస్తే అది తెచ్చే తిప్పలు ఎంతన్నది తాజాగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మీద వెల్లువెత్తుతున్న పోస్టింగులు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
అమ్మ అంతిమయాత్రకు హాజరైన రాహుల్.. అంత్యక్రియలు జరుగుతున్న వేళ.. తన పార్టీకి చెందిన నేతలతో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించారు. అమ్మ పోయి.. యావత్ తమిళనాడు విషాదంలో మునిగిన వేళ.. ఓవైపు అంతిమ సంస్కారాలు సాగుతున్న సమయంలో వాతావరణం గంభీరంగా మారిపోతే.. ఆ సమయంలో నవ్వులు చిందిస్తూ ఉన్న రాహుల్ ఫోటోలుఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ అయ్యాయి.
ఇలాంటి అవకాశం కోసమే కాచుకొని ఉంటే మోడీ అభిమానులు.. అమ్మకు నివాళులు అర్పించే సమయంలో మోడీ వ్యవహరించిన ఫోటోల్ని పెట్టి.. ఆ పక్కనే అమ్మ అంతిమ సంస్కారాల సమయంలో రాహుల్ చిరునవ్వులు చిందించటాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు తయారు చేసేవారు. పెనువిషాదం చోటు చేసుకున్న వేళ.. జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. నవ్వేసి నవ్వులపాలు కావటం రాహుల్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో..?