సురేశ్ ప్రభు? మరీ ఇంత దారుణమా?

Update: 2017-05-17 06:58 GMT
ప్రయాణికులను పిండి సొమ్ము చేసుకోవడంలో రైల్వే శాఖ ఆరితేరిపోతోంది. ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా డబ్బులు సంపాదించాలనే తాపత్రయం ఆ శాఖకు ఇటీవల మరీ ఎక్కువైపోయింది.  తాజాగా మరో భారీ అటాక్ కు ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు సిద్ధమవుతున్నారు.
    
రైలు ప్రయాణాల్లో లోయర్ బెర్త్‌‌ లకు డిమాండ్ ఉండడంతో దానిని సొమ్ము చేసుకునేందుకు రైల్వే శాఖ రెడీ అయిపోయింది.  లోయర్ బెర్త్ కావాలనుకునే వారి నుంచి అదనంగా రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఎంత మొత్తం అన్నది ప్రస్తుతానికి ఖరారు కాలేదు. త్వరలోనే రైల్వే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే.. లోయర్ బెర్త్‌లు కోనుకునే వారిలో వృద్ధులు - మహిళలు - పిల్లలే ఉంటారు కాబట్టి వారి నుంచి సర్‌ చార్జి పేరుతో అదనంగా వసూలు చేయడం సరికాదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
    
రైలులోని మొత్తం లోయర్ బెర్త్‌ ల సంఖ్యలో 10-15 శాతాన్ని సీనియర్ సిటిజన్లకు కేటాయించాలన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో రైల్వేశాఖ ఈ విషయంలో డైలమాలో పడింది. అయితే త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా విమానాల్లో విండో సీట్లకు అదనంగా వసూలు చేస్తారు. ఇప్పుడు అదే పద్ధతిని రైల్వేలోనూ అమలు చేయాలన్నది రైల్వే ఉద్దేశంగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News