చేప‌ల వ‌ర్షం.. క‌ప్ప‌ల వ‌ర్షం.. ఓకే.. కానీ, ఇదేం వ‌ర్షం బాబోయ్‌!

Update: 2022-12-09 04:06 GMT
మ‌న‌లో అంద‌రికీ సాధార‌ణ నీటి వ‌ర్షం  గురించి తెలుసు. సీజ‌న‌ల్ వారీగా వ‌ర్షాలు కురుస్తూనే ఉంటాయి .ఇవి లేక‌పోతే.. మ‌న‌కు పంట‌లు లేవు, ఆహారం అంత‌క‌న్నా లేదు. స‌రే.. దీనికి మించి అంటే..చేప‌ల వ‌ర్షం. ఆకాశం నుంచి చేప‌లు కురవ‌డం. ఇది కూడా మ‌న‌దేశంలోని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ వంటి రాష్ట్రాల్లో ఒక్కొక్క సీజ‌న్‌లో క‌నిపిస్తుంది. ఆకాశం నుంచి చేప‌లుప‌డుతుంటాయి.

ఇక‌, క‌ప్ప‌ల వ‌ర్షం. మ‌న‌ద‌గ్గ‌ర ఒకే ఒక్క‌సారి ప‌శ్చిమ బెంగాల్‌లో కురిసింది. ఇక్క‌డ‌కూడా క‌ప్ప‌లు జోరుగా ఆకాశం నుంచి రాలి ప‌డుతున్నాయా? అన్న‌ట్టుగా వ‌ర్షం కురిసింది. ఇది విదేశాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. స‌రే..ఈ రెండింటి గురించి క‌నీసం చెప్పుకొనైనా ఉన్నాం. కానీ, చిత్రంగా.. ఒడిశాలోని ఓ గ్రామంలోబుల్లెట్ల వ‌ర్షం కురుస్తుండ‌డం ఆశ్చ‌ర్యంగాను, అనుమానంగాను ఉంది.

ఒడిశాలోని ఓ గ్రామంలో బుల్లెట్లు  వ‌ర్షం రూపంలో ప్ర‌జ‌ల‌పై కి దూసుకొస్తున్నాయి. దీంతో గ్రామస్థులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. గత మూడేళ్లుగా ఈ ఘటనలు జరుగుతున్నాయ‌ని స్థానికులు చెబుతున్నారు.

ఒడిసా లోని కటక్ జిల్లా నువాఘమ్ గ్రామంలో అప్పుడప్పుడు తూటాల వర్షం కురుస్తోందని ప్ర‌జ‌లు చెబుతున్నారు. అయితే, పైనుంచి కురుస్తున్న ఈ బుల్లెట్లు ఎప్పుడు ఎక్క‌డ వ‌ర్షిస్తాయో తెలియ‌క పొవ‌డం గ‌మ‌నార్హం.  
 
నిజానికి శ‌త్రుదేశాల‌కు పొరుగున ఉన్న కొన్ని గ్రామాల్లో ఇలా జ‌రుగుతుంది. రాజ‌స్థాన్ లో ఒక‌ప్పుడు ఇలానే జ‌రిగింది. దీని వెనుక పాకిస్థాన్ ముఠా ఉంద‌ని అప్ప‌ట్లో గుర్తించారు. కానీ, ఒడిసా చుట్టుప‌క్క‌ల ఎక్క‌డా కూడా శ‌త్రుదేశం లేదు. కానీ, ఇలా బుల్లెట్ల వ‌ర్షం మాత్రం కురుస్తుండ‌డం గ‌మ‌నార్హం.అయితే, ఈ ఘటనలపై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా కలెక్టర్ చెప్ప‌డం విశేషం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News