తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్లతో మంచి సంబంధాలు మెయింటేన్ చేస్తాడు. అంతకుముందు ఉన్న గవర్నర్ నరసింహన్ తో మంచి అనుబంధాన్ని కొనసాగించాడు. వీళ్లిద్దరి మధ్య అన్నాదమ్ముల వలే అనుబంధం ఉండేది.
నరసింహన్ తెలంగాణ గవర్నర్ గా దిగిపోయాక.. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న బీజేపీ నాయకురాలు అయిన తమిళిసైని తెలంగాణ గవర్నర్ గా బీజేపీ నియమించింది. అయితే తమిళిసై గవర్నమెంట్ తో మంచి సంబంధాలే కొనసాగించింది. అయితే ఈ మధ్య కరోనా టైంలో తెలంగాణలో కేసులు, టెస్టుల ట్రేసింగ్ సరిగా జరగడం లేదని.. ఆమె స్వయంగా డాక్టర్ కావడంతో నేరుగా అధికారులతో ప్రైవేట్ ఆసుపత్రులతో రివ్యూ చేసి రిపోర్ట్ తెప్పించుకుంది. టెస్టులు తెలంగాణలో సరిగా జరగడం లేదని.. ఎన్ని సార్లు చెప్పినా టెస్టులు చేయడం లేదని ఈ మధ్య జాతీయ మీడియాకు ఆమె ఇంటర్వ్యూ సందర్భంగా విమర్శించారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వంలో కలకలం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గవర్నర్ ని బీజేపీ అధ్యక్షురాలు అంటూ ట్వీట్ చేసి డిలేట్ చేయడం దుమారం రేపింది. టీవీ చానెల్స్ లో దీనిపైనే పెద్ద ఎత్తున డిబేట్ జరిగి రచ్చరచ్చఅయ్యింది.
ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ గవర్నర్ కి సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే గవర్నర్ విమర్శలపై టీఆర్ఎస్ ఇంకా పూర్తిస్థాయిలో అధికారికంగా స్పందించలేదు.
కేసీఆర్ వర్క్ స్టైల్ గమనిస్తే.. ఒక సమస్య వచ్చినప్పుడు దాని మీద పెద్దగా రియాక్ట్ కాకుండా.. టైం వచ్చినప్పుడు దుమ్ము దులిపేస్తాడు. అయితే ప్రస్తుతం రాజ్ భవన్ జోలికి వెళ్లవద్దు అని అనధికారికంగా కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. దీంతో కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ప్రస్తుతానికి గవర్నర్ వ్యాఖ్యలపై మౌనాన్నే ఆశ్రయించారు.