ఏదైనా ఇష్యూ మీద నిలకడగా పోరాటం చేయడు.. వివాదాస్పద అంశాల మీద ఒక స్టాండ్ కు కట్టుబడి ఉండడు అన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఉన్న కంప్లైంట్. కొన్నిసార్లు పవన్ తీరు చూస్తే ఈ ఆరోపణలు నిజమే అనిపిస్తుంది. ఏపీలో జోరుగా సాగుతున్న మత మార్పిడులు.. తిరుమల సహా కొన్ని హిందూ పుణ్య క్షేత్రాల్లో అన్యమత ప్రచారంపై ముందు అందరి లాగే పవన్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్లకు పవన్ హీరోలా కనిపించాడు. కానీ ఇంతలోనే పవన్ ఈ అంశం మీద భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఒక సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. తిరుమలలో అన్యమత ప్రచారం గురించి రాజకీయ పార్టీలు మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
తిరుమల అన్యమత ప్రచారం గురించి స్థానిక నాయకులు - అధికారులు స్పందించి అలా జరగకూడదంటే సరిపోతుందని.. అంతకుమించి ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నాడు. ఓట్ల కోసమే దీని మీద రాజకీయం చేస్తున్నారంటూ పరోక్షంగా భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు గుప్పించాడు పవన్. మరోవైపు గల్ఫ్ దేశాల్లో పని కోసం వెళ్లి అక్కడ ఇబ్బంది పడే వాళ్లలో హిందువుల కంటే ముస్లింలే ఇండియా బాగుందని అంటారంటూ ఒక కన్ఫ్యూజింగ్ కామెంట్ చేశాడు పవన్. హిందువులు - ముస్లింల మధ్య గొడవలు పెట్టేది హిందూ నాయకులే అని.. మిగతా వాళ్లకు అలాంటి ఆలోచనే ఉండదంటూ పవన్ మరో వివాదాస్పద స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీనిపై భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ మండి పడ్డాడు. పవన్ హిందూ వ్యతిరేకి అంటూ ధ్వజమెత్తాడు. పవన్ ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థమవుతోందా అని ప్రశ్నించిన రాజా సింగ్.. ఆయన స్టాండ్ ఏంటో వివరంగా చెప్పాలన్నాడు. ఆయన వేరే మతంలోకి కన్వర్ట్ అయ్యాడేమో అన్న రాజా సింగ్.. తాను ఒకప్పుడు పవన్ కు అభిమానినని.. కానీ ఇప్పుడు కాదని.. జనసేన ఒక చిల్లర పార్టీ అని విమర్శించాడు. పవన్ కళ్యాణ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించిన రాజా సింగ్.. తన వ్యాఖ్యల్ని పవన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు.