భారత ఆర్మీకి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ గడ్డకు చేరవేస్తున్న ఓ డబుల్ ఏజెంట్ ను రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. అతడి ల్యాప్ టాప్ నుంచి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ముస్తాక్ అలీఖాన్ (40) అనే వ్యక్తి రాజస్థాన్ లోని పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన కీలక స్థావరాలను రహస్యంగా వీడియోలు తీసి ఐసిస్ ఉగ్రవాదులకు పంపించినట్లు అధికారులు గుర్తించారు. కీలక సమాచారాన్ని చేరవేసినట్లు సమాచారం.
ఏడాది కాలంగా ఈ గూఢచారి పాకిస్తాన్ కు, ఐసీస్ కు ఆర్మీ రహస్యాలు చేరవేస్తున్నట్టు విచారణలో తేలింది. రాజస్థాన్ లోని బార్మర్ లో నివాసం ఉంటూ ఈ పనిచేస్తున్నాడు. ఓ నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేయగా.. ఈ విషయం పోలీసులకు తెలిసింది.
నిందితుడు ముస్తాక్ తన జీమెయిల్ అకౌంట్ ద్వారా భారత ఆర్మీ రహస్యాలు, ఫొటోలు, వీడియోలు సున్నితమైన అంశాలను చేరవేసినట్టు గుర్తించారు. భారత సైన్యానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు నటిస్తూ శత్రుదేశాలకు కీలక సమాచారాన్ని చేరవేసే ‘డబుల్ ఏజెంట్’గా ముస్తాక్ వ్యవహరిస్తున్నాడని ఇంటెలిజెన్స్ ఏడీజీ ఉమేశ్ మిశ్రా తెలిపారు.