గోళ్లు పీకి.. గ్యాంగ్ రేప్ చేశారు.. చేసినోళ్లు ఎవ‌రంటే?

Update: 2019-07-15 06:12 GMT
మ‌నుషుల కంటే మృగాలే న‌య‌మ‌నిపించే ఉదంతాలు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ చోటు చేసుకుంటున్నాయి. మ‌నిషిలో ఉండాల్సిన మాన‌వ‌త్వం మంట‌గ‌లిసిపోవ‌ట‌మే కాదు.. మ‌నిషి అనేటోడు ఇలా చేస్తారా? అన్న సందేహం క‌లిగే ప‌రిణామాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి.  తాజా ఉదంతం చూస్తే.. షాక్ తిన‌ట‌మేకాదు.. ఒళ్లు గ‌గుర్పాటుకు గురి అవుతుంది. మ‌నం బ‌తుకుతున్న స‌మాచారం ఇంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.రాజ‌స్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు పెనుసంచ‌ల‌నంగా మారింది.  ఆ రాష్ట్రంలోని చురు జిల్లాలో ఒక చోరీ జ‌రిగింది.

22 ఏళ్ల నేమిచంద్ అనే వ్య‌క్తి ఈ దొంగ‌తానికి పాల్ప‌డిన‌ట్లుగా గుర్తించారు. అయితే.. ఇది కేవ‌లం అనుమానం మాత్ర‌మే. దీంతో అత‌డ్ని పోలీసు స్టేష‌న్ కు తీసుకెళ్లారు. ఇక్క‌డితో పోలీసుల ఆరాచ‌కం ఆగ‌లేదు.  నేమిచంద్ వ‌దిన‌ను కూడా తీసుకెళ్లారు. చోరీ గురించి ఆమెను ప్ర‌శ్నించారు. దారుణ‌మైన చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు.

ఆమె గోళ్లు ఊడ‌బీక‌ట‌మే కాదు.. రెప్ప తెర‌వ‌లేనంత‌గా క‌ళ్ల మీద దెబ్బలు కొట్టారు. మృగాల మాదిరి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. నిందితుడి వ‌దిన ప‌ట్ల ఎందుకింత దారుణంగా వ్య‌వ‌హ‌రించారంటే.. పోలీసుల అదుపులో ఉన్న నిందుడిని కొట్టిన దెబ్బల‌తో అత‌గాడు పోలీస్ స్టేష‌న్లో మ‌ర‌ణించాడు. ఈ హ‌త్య‌ను ఆమె క‌ళ్లారా చూశారు. దీంతో.. ఆమె ప‌ట్ల ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా బాధితురాలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆమె ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు.. దీనికి బాధ్యులుగా భావిస్తున్న ఆరుగురు పోలీసుల‌పై కేసున‌మోదు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తేలా చేస్తోంది.


    
    
    

Tags:    

Similar News