సంచలన నిర్ణయం తీసుకున్న ఆ రాష్ట్ర స్పీకర్ ... హైకోర్టు తీర్పుపై సుప్రీంలో పిటిషన్ !

Update: 2020-07-22 11:09 GMT
రాజస్థాన్ లో రాజకీయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ కాంగ్రెస్ ‌లో చెలరేగిన తుఫాన్ ఇప్పట్లో సమసిపోయేలా లేదు. సచిన్ పైలట్‌ పై రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ‌పైనా హైకోర్టులో ప్రభుత్వానికి ప్రతికూల ఫలితమే వచ్చింది. కొద్దిరోజుల వరకు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పై ఎలాంటి చర్యలను తీసుకోకూడదంటూ హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు తీర్పు పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంలో తేల్చుకోవడానికి రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ.. ఈ రోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ ‌ను దాఖలు చేశారు. స్పీకర్ తరఫున ప్రముఖ న్యాయవాది ఈ పిటీషన్‌ ను దాఖలు చేసారు. ఈ సందర్భంగా సీపీ జోషీ జైపూర్ ‌లో మీడియాతో మాట్లాడుతూ .. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే సర్వహక్కులు స్పీకర్‌కు ఉన్నాయని, దీన్ని న్యాయస్థానాలు ప్రశ్నించలేవని అన్నారు. రాజ్యంగానికి, చట్టసభ రూల్స్ ప్రకారమే తాము శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తామని, దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడం సరైనది కాదని చెప్పుకొచ్చారు.

కాగా, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సహా ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై స్పీకర్ అనర్హత వేటు వేయగా.. దానిపై ఆయన హైకోర్టు లో పిటీషన్‌ ను దాఖలు చేయగా , దాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ వరకు సచిన్ పైలట్, ఆయన వర్గ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ స్పీకర్.. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాజస్థాన్ లో రాజకీయం మంచి రసపట్టుగా సాగుతుంది. చూడాలి మరి హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థిస్తుందో .. లేదో
Tags:    

Similar News