రాజకీయ నాయకులు చెప్పే కలలకు.. వాటి సాకారం కావటానికి మధ్య అంతరం ఎంతన్నది ఈ ఉదంతం ఇట్టే చెప్పేస్తుంది. ప్రధాని మోడీ సర్కరు బుల్లెట్ ట్రైన్ కలను ఆవిష్కరించినప్పుడు దేశ ప్రజలంతా సంతోషానికి గురయ్యారు. రైల్వేల రూపురేఖల్ని మార్చే ఈ అంశం ఇంతకాలానికి చర్చకు రావటమే కాదు.. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా కసరత్తు చేయటంపై చాలామంది హర్షం వ్యక్తం చేశారు. కలలు ఎంత భారీగా ఉంటాయో.. వాటిని సాకారం చేసుకునేందుకు పెట్టాల్సిన ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుందన్న విషయం.. బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం ఖర్చు విన్న వెంటనే అర్థమయ్యే పరిస్థితి.
ప్రస్తుతం ప్రభుత్వం అనుకుంటున్న బుల్లెట్ ట్రైన్ కారిడార్ కు అయ్యే ఖర్చు రూ.97,636 కోట్లుగా చెబుతున్నారు. మరి.. ఇన్ని వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసే బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించటానికి మరెంత ఖర్చు పెట్టాలన్నది ఒక ప్రశ్న. మామూలు రైలు ట్రాక్ ను నిర్మించాలంటే కిలో మీటర్ కు రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్లు ఖర్చు అవుతుంటే.. బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మించాలంటే కిలోమీటర్ కు రూ.140 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మరింత ఖరీదైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తి అయి.. ప్రజలు ఆ ట్రైన్ లో ప్రయాణించాలంటే టికెట్ ధర ఎంతన్నది ఇప్పుడే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టికెట్ ధర ఆధారంగానే బుల్లెట్ ట్రైన్ లో జనాలు ప్రయాణం చేస్తారా? లేదా? అన్నది తేలుతుంది. బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరకు సంబంధించి ఇప్పటికే చాలా మాటలు ప్రచారంలో ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్ టికెట్ల ధరలు భారీగా ఉంటాయన్న వాదనకు బలం చేకూరేలా ప్రభుత్వం తాజాగా సమాధానం ఇవ్వటం గమనార్హం. రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రైల్వే సహాయమంత్రి రాజేన్ గోహైన్.. బుల్లెట్ ట్రైన్ టికెట్ ధర మామూలు రైళ్ల ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ ధర కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉంటుందని స్పష్టం చేశారు. అంటే.. విమాన ధరల కంటే అధికమన్నమాట. మరి.. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించేందుకు ప్రజలు ముందుకొస్తారా? అలాంటప్పుడు లక్ష కోట్ల ఖర్చుతో అంత భారీ ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఉందా? అన్నది అసలు ప్రశ్న. గూబ గుయ్యిమనేలా ఉంటే బుల్లెట్ ట్రైన్ ను తీసుకొచ్చే కంటే.. బిజీగా ఉంటే రూట్లలో అదనపు లైన్ నిర్మించే అంశంపై దృష్టి సారిస్తే మంచిదేమో.