సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వారు హీరోహీరోయిన్లుగా రాణించి ముఖ్యమంత్రులు కాగలిగారు. అయితే రాజకీయ నాయకులు సినిమా రంగంలోకి రావడం చాలా అరుదు.
సినీ నటి ఆర్కే రోజా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటక, క్రీడల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు జగన్ కేబినెట్‌లో మరో మహిళా మంత్రి సినిమా రంగంలోకి వస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఆమె నటిగా కాకుండా నిర్మాతగా ఆమె ఎంట్రీ ఇస్తున్నారని చర్చ జరుగుతోంది.
తెలుగు సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న ఆ మహిళా మంత్రి మరెవరో కాదు.. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
మీడియా కథనాల ప్రకారం.. విడదల రజనీ ఒక తెలుగు చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఈ దిశగా ఆమె హైదరాబాద్‌లో ప్రొడక్షన్ హౌస్‌ని కూడా ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు, అక్కడ విడదల రజని నిర్మించే కొత్త చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
విడదల రజిని నిర్మించబోయే చిత్రానికి సంబంధించిన కథ, స్క్రీన్‌ప్లే సిద్ధమయ్యాయని చెబుతున్నారు. ఈ సినిమా చేయడానికి రజనీ ప్రముఖ దర్శకుడు, హీరోతో చర్చలు కూడా జరుపుతున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. తొలి చిత్రాన్నే భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో నిర్మించాలని ఆమె తలపోస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
కాగా తెలంగాణలోని భువనగిరి దగ్గర ఒక పల్లెటూరుకు చెందిన విడదల రజని హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఓ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు యూఎస్ వెళ్లారు. తరువాత అమెరికాలోనే ఒక కంపెనీని ప్రారంభించి భారీ ఎత్తున లాభాలు ఆర్జించారు.
తాగునీరు, పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, యువతకు ఉద్యోగావకాశాలు వంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడానికి ఆమె వీఆర్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన విడదల రజని కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్తది చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నం.
2014లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజినీ 2018లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్ తో పోటీ పడి మరీ టికెట్ దక్కించుకున్నారు. ఆర్థికంగా బలవంతురాలు కావడం, డబ్బు ఖర్చుకు వెరవకపోవడం, ఆమె మహిళ కావడం, అందులోనూ బీసీ అవ్వడం, మరోవైపు ఆమె భర్త ఏపీలో బలమైన కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడం వంటి సమీకరణాలతో ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. వైసీపీ వేవ్ లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు.
గతేడాది వైఎస్ జగన్ రెండో మంత్రివర్గ విస్తరణలో ఇవే సమీకరణాలతో విడదల రజనికి కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం లభించింది. తాజాగా బాగా పనిచేస్తున్న ముగ్గురు మంత్రుల్లో ఒకరిగా సీఎం జగన్ ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే వ్యాపార, రాజకీయ రంగాల్లో విజయవంతమైన విడదల రజిని సినిమా రంగంలోనూ సక్సెస్ అవుతారో, లేదో వేచిచూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.