మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అడిగాడా.. లేక రజినీకాంతే స్వయంగా పంపిస్తున్నాడా... అన్ని క్లారిటీ లేదు కానీ.. అమరావతి శంకుస్థాపన కోసం రజినీకాంత్ తరఫు నుంచి లగ్జీరియస్ బస్సులు విజయవాడకు రాబోతున్నాయి. సినిమాల్లోకి రాకముందు బస్ కండక్టరుగా పని చేసిన రజినీ దగ్గర ప్రస్తుతం కొన్ని లగ్జీరియస్ బస్సులున్నాయి. వాటిని హైటెక్ కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటారు. మరి ‘అమరావతి శంకుస్థాపన’ కోసం రజినీకాంత్ ను బస్సులు పంపమని ఎవరడిగారన్నది తెలియడం లేదు కానీ.. ఆయనైతే రెండు లగ్జీరియస్ బస్సుల్ని విజయవాడకు పంపిస్తున్నారు.
ఇప్పటికే గన్నవరం ఎయిర్ పోర్టుకు ఆ రెండు బస్సులూ చేరుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చే అతిథుల కోసం ఈ బస్సుల్ని వినియోగించబోతున్నారు. రజినీకాంత్ కు కూడా ఈ కార్యక్రమం కోసం చంద్రబాబు ఆహ్వానం పంపినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకు సన్నిహితుడైన రజినీకాంత్ కూడా దసరా రోజు అమరావతిలో సందడి చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక రజినీ లాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం అతిథుల కోసం తన ట్రావెల్ కంపెనీకి చెందిన లగ్జీరియస్ బస్సులతో ఆడి, బీఎండబ్ల్యూ కార్లను తిప్పుతున్నారు.