బ్రేకింగ్: రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఇదే?

Update: 2020-12-15 05:42 GMT
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది.  మరో రెండు వారాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ పార్టీని ప్రకటించి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.  ఈ పరిణామం తమిళ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల చుట్టూ భారీ సస్పెన్స్ నెలకొంది. తలైవర్ అభిమానులు ఆయన రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రజినీకాంత్ తన రాజకీయ పార్టీ పేరు ‘మక్కల్ సేవై కర్చి’గా రిజిస్ట్రర్ చేసుకున్నట్టు తెలిసింది. ఇక తన పార్టీ ఎన్నికల గుర్తుగా  ‘ఆటో రిక్షా’ను ఎంచుకున్నట్టు సమాచారం.   ఈ మేరకు ఈ పోల్ సింబల్‌ను కేటాయించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ)కి లేఖ రాశారు. పార్టీగా మక్కల్ సేవై కచ్చి (ఎంఎస్‌కె) పేరు ఖరారు చేసి రజినీకాంత్ తన   దరఖాస్తును పంపినట్టు ప్రచారం సాగుతోంది.

రజనీకాంత్ తో ‘ఆటోరిక్షా’కు అవినాభావ సంబంధం ఉంది.  ఇదె సెంటిమెంట్ కూడా. 90 వ దశకంలో రజినీ సినీ జీవితంలోనే అతిపెద్ద హిట్ చిత్రం‘బాషా’లో ఆటో డ్రైవర్‌గా చేసి రికార్డులు సృష్టించాడు. ఈ ఆటో మధ్యతరగతి ప్రజలలో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందిన గుర్తు. స్వతహాగా మాస్ హీరో అయిన రజినీకాంత్ కు ఈ గుర్తు బాగా సరిపోతుందని సమాచారం.

అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. రజినీకాంత్ పార్టీ ప్రకటించే డిసెంబర్ 31 న అధికారిక ప్రకటన వెలువడనుంది.
Tags:    

Similar News