ఎంపీల సాలరీల్లో 30 శాతం కోత .. బిల్లుకు ఆమోదించిన రాజ్యసభ!

Update: 2020-09-18 14:30 GMT
కరోనా వైరస్ కారణంగా ఎంపీ వేతనాల్లో కోత కు రాజ్యసభ ఆమోదం తెలింది. పార్లమెంటు సభ్యులు, మంత్రుల వేతనాలు, అలవెన్సు లను 30 శాతానికి తగ్గిస్తూ తీసుకువచ్చిన బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ ‌షా తరఫున తాను బిల్లును లోక్‌ సభ లో ప్రవేశపెడుతున్నట్టు హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

కరోనా కాలంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ బిల్లును తీసుకువచ్చినట్లు మంత్రి కిషన్ రెడ్డి సభకు వివరించారు. దీనిపై చర్చించిన అనంతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సభ శనివారం ఉదయం 9 గంటల వరకూ వాయిదా పడింది.వైరస్ పై పోరాటానికి నిధులను సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోతను విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏప్రిల్ 6న ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాల కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మరోవైపు… ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపోతే, గత సోమవారం నాడు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1వ తేదీతో ముగియనున్నాయి.
Tags:    

Similar News