బిగ్‌ బాస్‌ లో ఎవ‌రు ఎవ‌రికి రాఖీ క‌ట్టారంటే..

Update: 2019-08-17 06:19 GMT
బిగ్ బాస్ శుక్రవారం హౌస్ మేట్స్ మెదడుకు పని చెప్పే పని చేశారు. ఈ మేరకు పురుషుల-మహిళల జట్లకి క్విజ్ పోటీ పెట్టారు. క్విజ్ మాస్టారుగా శివజ్యోతి ఉంది. ఇక మూడు రౌండ్లు సాగిన ఈ పోటిలో పురుషులు జట్టు ఒక పాయింట్ తేడాతో విజయం సాధించింది. ముందుగా చెప్పిన విధంగా గెలిచిన జట్టుకు యాప్పీ ఫిజ్‌ ను బహుమతిగా అందించారు. అలాగే క్విజ్ మాస్టర్‌ కు ఓ యాప్పీ ఫిజ్ లభించింది.

ఆ తర్వాత హౌస్ లో రాఖీ పండుగ వేడుకలు మొదలయ్యాయి. హౌస్ మేట్స్ కి తమ బంధువులు రాఖీలు, స్వీట్స్ పంపించారు. ఈ సందర్భంగా బంధువుల పంపిన రాఖీలని హౌస్ మేట్స్ తో కట్టించుకున్నారు. ఈ సందర్భంగా హౌస్ మేట్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా శివజ్యోతి అలీకి రాఖీ కడుతూ గుక్కపెట్టి ఏడ్చింది.

శివ జ్యోతికి అలీ సిస్టర్స్ ప్రత్యేకంగా ఓ గిఫ్ట్- రాఖీ పంపారు. దీంతో ఆ ఆనందంలో అలీని హత్తుకుని ఏడుపు మొదలుపెట్టింది. ఇక అలీ సర్ది చెప్పి రాఖీ కట్టించుకున్నాడు. అలాగే రవికి.. రోహిణి- హిమజలు కట్టగా- మహేశ్ కి వాళ్ళ చెల్లి పంపిన రాఖీని జ్యోతి- ఆషూ- రోహిణిలతో కలిపి కట్టించుకున్నారు. శ్రీముఖి వెరైటీగా వాళ్ళ తమ్ముడు పంపిన రాఖీని బాబా మాస్టర్ తో కట్టించుకుంది. ఇక తర్వాత పునర్నవి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు చెబుతూ రాహుల్‌కి తప్ప అని ట్విస్ట్ ఇచ్చింది.

దీంతో హౌస్ మేట్స్ రాహుల్ ని సరదాగా ఆటపట్టించారు. చివరికి పునర్నవి వరుణ్‌కు రాఖీ కట్టింది. చివర్లో బాబా భాస్కర్ కోసం ఆయన భార్య పంపిన వీడియోను ఇంటి సభ్యుల ముందు ప్రదర్శించారు. తమ గురించి బెంగ పెట్టుకోవద్దు.. మిమ్మల్ని మేము రోజు చూస్తున్నాం. మీరే మమల్ని చూడటం లేదు. మేము బాగానే ఉన్నామంటూ బాబా భాస్కర్ కు ఆయన భార్య సందేశం ఇచ్చింది.
   
   
   

Tags:    

Similar News