ఒకవైపు తెలుగుదేశం పార్టీ అమరావతి కేంద్రంగానే పాలన అంతా సాగాలనే డిమాండ్ ను వినిపిస్తూనే ఉంది. వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అస్సలు ఒప్పుకోవడం లేదు. తను అధికారంలో ఉన్నప్పుడు వికేంద్రీకరణ ఆలోచనకు విరుద్ధంగా అంతా అమరావతి నుంచినే అంటూ చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. తాత్కాలిక నిర్మాణాలు కొన్ని చేపట్టారు. భారీ ఎత్తున భూ సేకరణ చేశారు.
అయితే ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ మంత్రం పఠిస్తుండే సరికి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమరావతి ప్రాంతంలోనే తిరుగుతూ చంద్రబాబు నాయుడు అంతా అమరావతి నుంచినే జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాయలసీమకు హై కోర్టు అవసరం లేదని - విశాఖకు రాజధాని వద్దని చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నాడు. అంతా అమరావతి నుంచినే జరగాలని అంటున్నారు.
ఇక అమరావతికి అనుకూల ధర్నాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే పాల్గొన్న సంగతి తెలిసిందే. తనది జాతీయ స్థాయి చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇలా మూడు నాలుగు పల్లెలకు పరిమితం అయిపోయారని ఒక వైపు విమర్శిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఆ రూట్లోనే సాగుతూ ఉన్నారు. అమరావతి అనుకూల ధర్నాలకు తెలుగుదేశం పార్టీ వత్తాసు పలుకుతున్నారు. పనిలో పనిగా డబ్బులు సేకరించే విరాళాల వ్యవహారం కూడా ఒకటి స్టార్ట్ చేశారు.
అయితే చంద్రబాబు నాయుడి ధర్నాలను ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే మరోవైపు ఇప్పుడు కౌంటర్ ర్యాలీలు మొదలయ్యాయి. మూడు రాజధానుల ఫార్ములాకు అనుకూలంగా ఏపీ వ్యాప్తంగా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏపీకి మూడు రాజధానులు అవసరమని వాదించే వాళ్లు ఇప్పుడు రోడ్డెక్కుతూ ఉన్నారు. అమరావతి కేంద్రంగానే అంతా జరిగితే కుదరదని.. మిగతా ప్రాంతాలకూ రాజధానిని పంచాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు పనిలో పనిగా చంద్రబాబు నాయుడి మీద కూడా తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు రాయలసీమ వైపు వస్తే ఆయనను అడ్డుకుని తీరతామంటూ ఆ ప్రాంతం వాళ్లు ప్రకటిస్తున్నారు కూడా. మరి ఈ కౌంటర్ ధర్నాలతో తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.