వర్మ... పోలీస్ .... ట్రూత్ ...!

Update: 2018-02-17 17:16 GMT
అమెరిక‌న్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వివాదాస్పద  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెర‌కెక్కించిన `జీఎస్టీ` వివాదంలో వ‌ర్మ నేడు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. జీఎస్టీపై లైవ్ లో మాట్లాడిన వ‌ర్మ‌....సామాజిక కార్యకర్త దేవిపై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం, జీఎస్టీలో మహిళలను కించపర‌చ‌డం పై సీసీఎస్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. గ‌త వారం బిజీగా ఉండి విచార‌ణ‌కు రాలేనని పోలీసుల‌కు చెప్పిన వ‌ర్మ‌....నేడు విచారణకు హాజర‌య్యారు. అయితే, విచారణ సమయంలో సైబర్‌ క్రైం అధికారులకు వర్మ స‌రిగా సమాధానం చెప్ప‌లేద‌ని, స‌హ‌క‌రించ‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, వ‌ర్మ త‌మ‌కు అన్ని స‌మాధానాలు స్పష్టంగా చెప్పార‌ని వ‌ర్మ‌ను విచార‌ణ చేసిన అడిష‌న‌ల్ డీజీపీ ర‌ఘువీర్ చెప్పారు. తాము అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ‌ర్మ స్ప‌ష్ట‌మైన స‌మాధానాలు ఇచ్చార‌ని అన్నారు. జీఎస్టీని తెర‌కెక్కించేందుకు వాడిన ల్యాప్‌టాప్ లో ఉన్న మియా మాల్కోవా ఫొటోల‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామ‌ని రఘువీర్ చెప్పారు. అయితే, వ‌ర్మ ల్యాప్ టాప్ లోని ఫొటోల‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామ‌ని, ఆ నివేదిక వ‌చ్చిన త‌ర్వాత మ‌రోసారి సోమ‌వారం నాడు విచార‌ణకు హాజ‌రు కావాల‌ని వ‌ర్మ‌కు సూచించామ‌ని చెప్పారు.

అయితే, జీఎస్టీ ని తాను విదేశాల్లో షూట్ చేసినందువ‌ల్ల త‌న‌కు భార‌తీయ చ‌ట్టాలు వ‌ర్తించ‌వ‌ని వ‌ర్మ భావించ‌డం స‌రికాద‌ని, ఆయ‌న ఒక భార‌తీయ పౌరుడు కాబ‌ట్టి ఎక్క‌డ‌ సినిమా తీసినా ఇక్క‌డి చ‌ట్టాలు వ‌ర్తిస్తాయ‌ని ర‌ఘువీర్ తెలిపారు. ఇంత చిన్న లాజిక్ ను వ‌ర్మ మిస్ అయ్యార‌ని తెలిపారు. వాస్తవానికి ఇది చాలా పెద్ద నేర‌మ‌ని అన్నారు. వ‌ర్మా ఆ సినిమాకు డైరెక్టర్‌ తాను కాదని, జీఎస్టీ సినిమా షూటింగ్‌లో తాను పాల్గొనలేదని చెప్పార‌ని, కేవలం కాన్సెప్ట్ మాత్రమే తనదని అన్నారని ర‌ఘువీర్ తెలిపారు. జీఎస్టీ తీసినందుకు తాను ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని వర్మ అన్నార‌ని, దేవిని కావాలని తాను దూషించలేదని, మాటా మాటా పెరిగి వివాదంగా మారిందని తెలిపార‌ని ర‌ఘువీర్ చెప్పారు. అయితే, వ‌ర్మ ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ట్లు త‌మ వ‌ద్ద ఆధారాలున్నాయ‌ని, ఆ షూటింగ్ కు వాడిన ల్యాప్ టాప్, ఆయ‌న మొబైల్ ను స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. ఐటీ చట్టం, ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద వ‌ర్మ‌పై రెండు కేసులు నమోద‌య్యాయ‌ని, ఒక వేళ వ‌ర్మ‌పై అభియోగాలు రుజువైతే ఆయ‌న‌కు 2-5 సంవ‌త్స‌రాల‌పాటు శిక్ష ప‌డే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం నాడు వ‌ర్మ‌ను సీసీఎస్ అధికారులు మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రిపే అవ‌కాశ‌ముంద‌ని, ఒక‌వేళ వ‌ర్మ....పోలీసుల అభియోగాల‌ను సోమ‌వారం నాడు అంగీక‌రిస్తే....త‌క్ష‌ణ‌మే వ‌ర్మ‌ను అరెస్టు చేసి జైలుకు పంపే అవ‌కాశ‌ముంద‌ని కూడా పుకార్లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News