సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ... ఏది చేసినా సంచలనమేనన్న వాదన వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నందమూరి బాలకృష్ణ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీీఆర్ చిత్రాన్ని తీసిన వర్మ... ఆ చిత్రం రిలీజ్ విషయంలో తనదైన శైలిలో పోరాడారు. ఎంత పోరాటం చేసినా ఆ చిత్రాన్ని ఇప్పటికీ ఏపీలో రిలీజ్ చేయలేకపోయిన ఆయన... ఆదివారంతో ఎన్నికల కోడ్ ముగియడంతో తన చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని భారీగా టార్గెట్ చేయాలని యత్నించిన వర్మ.... ఇప్పుడు చంద్రబాబు ఓడిపోయినా కూడా ఆయనను వదిలేది లేదని వర్మ తీర్మానించుకున్నట్లుగా ఉంది. ఆదివారం సాయంత్రం తన ట్విట్టర్ వేదికగా పెట్టిన ఓ పోస్టింగ్ తో చంద్రబాబును మరోమారు టార్గెట్ చేయడం ఖాయమేనని తేల్చేశారు.
తాను మరో చిత్రాన్ని తీస్తున్నానని చెప్పిన వర్మ... ఆ చిత్రానికి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు‘ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సంచలన ప్రకటన చేశారు. అంతేకాదండోయ్... ఈ చిత్రానికి కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన వైసీపీ నేత రాకేశ్ రెడ్డే నిర్మాతగా ఉంటారంటూ కూడా వర్మ మరో సంచలనం రేపారు. దానిని మించిన మరో ఆసక్తికర ప్రకటన కూడా చేశారు. ఈ చిత్రం షూటింగ్ విజయవాడ, అమరావతి పరిధిలోనే ఉంటుందని కూడా వర్మ చెప్పేశారు. మొత్తంగా వర్మ తదుపరి చిత్రం టైటిల్ - దాని నిర్మాత - దాని షూటింగ్ నేపథ్యం చూస్తుంటే... చంద్రబాబును వర్మ మరోమారు టార్గెట్ చేసినట్టుగానే చెప్పాలి.