బాబుపై మరో పంచ్ విసిరిన వర్మ

Update: 2019-07-11 10:46 GMT
తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని ఏపీలో విడుదల చేయకుండా అడ్డుకున్న చంద్రబాబు పై ట్విట్టర్ ద్వారా కసి తీర్చుకుంటున్న రాంగోపాల్ వర్మ.. తాజాగా మరోసారి ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను బేస్ చేసుకొని సెటైర్లు వేశారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడుతుంటే సీఎం హోదాలో జగన్ పడిపడి నవ్వారు. అప్పుడు బాబును చూస్తుంటే జగన్ కు బ్రాహ్మానందం గుర్తుకు వచ్చి అలా నవ్వేశాడని వర్మ కౌంటర్ వేశారు.

తాజాగా మరోసారి అసెంబ్లీలో అలాంటి సీనే పునరావృతమైంది.. తాను 40 ఇయర్స్ పాలిటిక్స్ అని.. తన రాజకీయ అనుభవం అంతా లేదు నీ వయసు అని జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. ఈ మాటలు మాట్లాడుతుండగా జగన్ పడిపడి నవ్వారు.

దీన్నిబేస్ చేసుకొని వర్మ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో మరోసారి బ్రాహ్మానందంలా చంద్రబాబు కామెడీ చేశారని.. అందుకే జగన్ నవ్వేశారని వర్మ సెటైర్ వేశారు. ఏపీ అసెంబ్లీలో బాబు కామెడీ ట్రాక్ కొనసాగుతోందంటూ సెటైర్లు వేశారు.

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వర్మ ఇలాగే పంచులిస్తే ఆయన సినిమాలు ఆడకుండా అడ్డుకున్నారు. వర్మ పై కేసులు పెట్టారు. ఇప్పుడు జగన్ అధికారంలో ఉండడంతో వర్మ రెచ్చిపోతూనే ఉన్నాడు.

    

Tags:    

Similar News