అందరిలో ఉత్కంఠ రేపి.. చివరకు ఊహించని రీతిలో విస్తరణ కార్యక్రమాన్ని ముగించారు ప్రధాని నరేంద్రమోడీ. 2019 ఎన్నికలే లక్ష్యంగా చేపట్టిన విస్తరణ అంకం చివరిలో ఊహించని పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. అంచనాలకు భిన్నంగా లభించిన పదవుల తీరు ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు తెర తీసేలా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ధర్మేంద్ర ప్రదాన్ ఒక పదం పలకటానికి తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆయన పలకటానికి ఇబ్బందిగా ఉన్న పదాన్ని మరోసారి స్పష్టంగా పలకాలన్న సూచనతో.. కాస్త ఆలస్యంగా తన తప్పును సరి చేసుకుంటూ ప్రమాణ స్వీకారాన్ని ముగించటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.
కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ధర్మేంద్ర ప్రదాన్.. హిందీలో సన్సూచిత్ పదాన్ని పలకలేకపోయారు. ఆ పదానికి బదులుగా సముచిత్ అని పలికారు. ధర్మేంద్ర పలికిన పదంలో తప్పును గుర్తించిన రాష్ట్రపతి.. సన్సూచిత్ అన్న పదాన్ని స్పష్టంగా పలకాలని కోరారు.
దీంతో.. కొన్ని క్షణాల అనంతరం రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్న రీతిలో ఆయన పదాన్ని పలికి తన ప్రమాణస్వీకారాన్ని ముగించారు. ప్రమాణస్వీకారం తర్వాత పెట్రోలియం శాఖామంత్రిగా ఎంపికైన ధర్మేంద్ర ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా మాత్రం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సన్సూచిత్ పదం ధర్మేంద్రకు చుక్కలు చూపించిందని చెప్పక తప్పదు.