కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి కథ అప్పుడిప్పుడే తేలేలా లేదు. ఒంటి మీదకు 50 ఏళ్లొస్తున్నా పెళ్లి ఊసే ఎత్తని ఈ యువరాజు అటు కుటుంబ జీవితం లేక ఇటు రాజకీయాల్లో రాణించకలేక సతమతమవుతున్నారు. అందుకే రాహుల్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటున్నారు అనుభవజ్హులు. ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల్ రాజకీయాలకు అన్ ఫిట్ అన్నది వారి భావన.
రాహుల్ గాంధీ రాజకీయాలు మానేసి వివాహం చేసుకుంటే ఆయనకు, దేశానికి కూడా మంచిదని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ అన్నారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామచంద్ర గుహ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో ఎంతోమంది మేధావులున్నప్పటికీ, అందరూ గాంధీల కుటుంబానికి విధేయులైపోయారని విమర్శించారు. దీనిని ఆయన ఇన్‌ఫాంట్-మదర్ సిండ్రోమ్‌గా అభివర్ణించారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా తిరిగి నిలబడే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి 44 లేదా 70, 80 కాకపోతే 100 సీట్ల వరకూ రావచ్చుకానీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించబోదని ఆయన అన్నారు. ఆ పార్టీ మరణానికి చేరువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.