పంచాయితీ ఎన్నికల పేరుతో ఏపీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై వైసీపీ నేతలు మాటల దాడిని పెంచారు. నిన్న మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయగా.. తాజాగా సీఎస్ కు, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తున్న నిమ్మగడ్డ పై ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ విప్ రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ 'నిమ్మగడ్డ చార్ దిన్ కా సుల్తాన్' అని.. ఎద్దేవా చేశారు. టీడీపీకి లబ్ది చేకూర్చేందుకే ప్రభుత్వ అధికారులను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీ విరమణ తర్వాత బతుకు బజారు పాలేనని ప్రభుత్వ విప్ విమర్శించాడు. నిమ్మగడ్డ ఆ పదవి నుంచి దిగిపోయాక ఆయనను ఎవరూ పట్టించుకోరని విమర్శించారు. నిమ్మగడ్డ ఎన్ని చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వం అంగీకరించదని అన్నారు.ఇప్పటికే వైసీపీ నేతలు మాటల దాడి పెంచారు. వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సైతం తాజాగా 'నిమ్మగడ్డకు పిచ్చి ముదిరింది' అంటూ విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వ విప్ కూడా విరుచుకుపడ్డారు.