అంచనాలకు మించి మరీ మోడీ ఎన్నికల్లో ఫలితాలు సాధించారు. వారికిప్పుడు ఏ రాజకీయ పార్టీ మిత్రుడిగా కలవాల్సిన అవసరం లేదు. సొంతబలంతో రెండోసారి పవర్లోకి వచ్చిన వేళ.. తాజాగా కేంద్రమంత్రి ఒకరు చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తిరుగులేని అధిక్యతతో ఏపీలో పవర్లోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్డీయేలో చేరాలంటూ కేందమంత్రి రాందాస్ అథేవలే ఆహ్వానం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
ఏపీ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టబడి ఉందన్న ఆయన.. మోడీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి.. ఏపీకి ప్రత్యేక హోదాను సాధించుకోవాలంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్డీయేలో చేరేందుకు జగన్ కు ఆహ్వానం వచ్చినా.. ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి వేళ.. కేంద్రమంత్రే ఆహ్వానం పలకటం ఇప్పుడు కొత్త పరిణామంగా మారింది.
మోడీ విషయంలో వ్యతిరేకంగా వ్యవహరించొద్దని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను చెప్పానని.. ఆయన తన మాటను వినలేదన్నారు. తన మాటను పట్టించుకోకుండా బాబు తప్పు చేశారని.. మోడీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పర్యటించిన ఆయన సొంత రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. బాబు చేసిన తప్పు జగన్ చేయొద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే.. జగన్ ను ఎన్డీయేలో చేరాలన్నది ఆహ్వానమా? లేదంటే.. సీరియస్ వార్నింగా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
బాబు మాదిరి తప్పు చేయొద్దని.. మోడీతో జగన్ సఖ్యతగా ఉండాలని ఆయన సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఎందుకంటే పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదాను అడిగాయని.. అందుకే ఇవ్వలేదన్నారు.కేంద్ర మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ ఎన్డీయే సర్కార్ లో భాగస్వామ్యం తీసుకుంటారా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ.. కేంద్రమంత్రి కోరినట్లుగా హోదా మీద ఎలాంటి కీలక ప్రకటన వెలువడకుండానే కేంద్రంలో జగన్ పార్టీ భాగస్వామి అయితే మాత్రం వ్యూహాత్మకంగా తప్పు చేసినట్లు అవుతుంది. కేంద్రమంత్రి తాజా వ్యాఖ్య నేపథ్యంలో జగన్ ఏం సమాధానం ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.