రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా సినిమా నటులో, క్రీడాకారులో ఉంటారనుకుంటే ఇకపై పొరపాటవుతుంది. గుజరాత్ కు అమితాబ్ బచ్చన్, తెలంగాణకు సానియా లాగా... ఇకపై హర్యానా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక యోగా గురువు నియమితులు కానున్నారు. అంతేనా... ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పించి ఎర్రబుగ్గ కారులో తిప్పనున్నారు.
వివరాల్లోకి వెళితే... యోగా గురువు రాందేవ్ బాబాని రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు కేబినెట్ హోదా కల్పించాలని తీర్మానించింది. ఈ విషయాలను హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు! ఈ విషయంలో ఈ బ్రాండ్ అంబాసిడర్ బాబాతో... రాష్ట్రం మొత్తం మీద 6500 గ్రామాల్లో యోగాశాలకు నిర్మిస్తారట. మరో విషయం ఏమిటంటే ... ఈ బాబా ఆధ్వర్యంలో వేల రకాల ఆయుర్వేద మూలికలకు సంబందించిన చెట్లను నాటిస్తారట! దీంతో హర్యానాలో అతి పెద్ద మూలికా వనం ఏర్పడబోతోందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు రచిస్తోంది. యోగా, ఆయుర్వేదాలకు ప్రాచుర్యం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. పాఠశాల విద్య నుంచే యోగా, ఆయుర్వేదంతో పాటు ఆధునికత, సంస్కృతి మేళవింపుతో ... విలువలతో కూడిన విద్యనందించటంలో ఈ రాం దేవ్ బాబాబు పూర్తిగా వాడేసుకోవాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కొత్త ట్రెండ్ అన్న మాట! మరో విషయం ఏమిటంటే... చాలా మంది బడా బడా రాజకీయ నేతలకు ఈ యోగా గురువు బినామీగా ఉంటున్నారనే గాసిప్స్ కూడా ఒక సమయంలో బాగా వినిపించాయి!! అయితే వాటిని ఎవరూ నిరూపించలేకపోయారు!!