ఏపీ ఎమ్మెల్యేల‌కు బాబా పాఠాలు

Update: 2015-11-13 09:29 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎమ్మెల్యేల‌కు మ‌రో కొత్త అవ‌కాశాన్ని అందించారు. ఏపీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకోసం ఒకరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. అయితే ఈ ద‌ఫా గ‌తంలోలాగా జ‌గ్గీవాసుదేవ్‌ తో  కాకుండా బాబా రాందేవ్‌ తో శిక్ష‌ణ ఇప్పించ‌నున్నారు.

తమిళనాడుకు చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ చే ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్‌ ఫుల్ లివింగ్ పేరుతో ఈ ఏడాది జ‌న‌వ‌రిలో రెండ్రోజుల పాటు శిక్ష‌ణ ఏర్పాటుచేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు - మంత్రులు -  ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులు కలెక్టర్లు - మేయర్లు ఈ స‌ద‌స్సులో భాగస్వామ్యం అయ్యారు.

తాజాగా ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాతో ఏపీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు యోగా పాఠాలు నేర్పించేందుకు బాబు షెడ్యూల్ ఖరారు చేశారు.  ఈ డిసెంబర్ 20న ఒకరోజు  జరగనున్న ఈ కార్యక్రమంలో యోగా పాఠాలు - ప్రాముఖ్యత - ఉపయోగాల గురించి రాందేవ్ బాబా బోధించ‌నున్నారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు ఏపీ శాసన సభా సమావేశాలు నిర్వహించనున్న నేప‌థ్యంలో  ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
Tags:    

Similar News