విశాఖ అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అని మరో పేరు. ఇక్కడకు వీలు దొరికితే చాలు ఎంతో మంది టూరిస్టులు వచ్చి అందాలను అస్వాదిస్తారు. విశాఖలో ప్రతిష్టాత్మకమైన తూర్పు నావికా దళం ఉంది. ఈసారి విశాఖలో ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అంగరంగ వైభవంగా జరగనుంది. ఇతర దేశాలకు చెందిన నౌకలు ఎన్నో ఇక్కడ ప్రదర్శనకు వస్తాయి.
ఒక విధంగా దేశం గర్వించే అతి పెద్ద నావికా ఉత్సవం ఇది. ఈ ఉత్సవానికి ముఖ్య అథిదిగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ వస్తున్నరు. ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విశాఖ చేరుకుంటారు. 21వ తేదీన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో ఆయన పాల్గొంటారు.
ఇదిలా ఉండగా ప్రధమ పౌరుడు విశాఖకు అతిధిగా వచ్చి చాలా ఏళ్ళు అయింది. విశాఖలో మూడు రోజుల పాటు రాష్ట్రపతి విడిది చేయడమూ ఈసారి ప్రత్యేకమే. దాంతో విశాఖ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్ళిపోనుంది.
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి విశాఖ ఘన స్వాగతం పలకడానికి అన్ని రకాలుగానూ సమాయత్తమవుతోంది. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూకి హాజరవుతారు అని అంటున్నారు. మొత్తానికి ఈనెల 20 సాయంత్రం విశాఖ చేరుకోనున్న రాష్ట్రపతి ఈ నెల 22 వరకూ ఉంటారు. దాంతో విశాఖ ఈ మూడు రోజులూ దేశంలోనే కీలకమైన స్పాట్ గా మారనుంది. మరి కొద్ది నెలల్లో రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి విశాఖ పర్యటన ఒక తీపి గురుతుగా మారనుంది అంటున్నారు.