ప్రపంచంలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో దీన్ని నిర్మించనున్నారు. ఈ బృహత్ బాధ్యత తలకెత్తుకున్నదెవరో కాదు.. మీడియా సామ్రాజ్యాధినేత రామోజీరావు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హనుమాన్ విగ్రహం నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన నిర్మించ తలపెట్టిన ఓం సిటీలో ఇది ఏర్పాటుచేస్తారు.
రామోజీరావు నిర్మించిన రామోజీ ఫిలింసిటీ ఇప్పటికే గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాల నమూనాలు ఒకే చోట ఉండేలా రామోజీ ఫిలింసిటీకి సమీపంలోనే ఓ ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించనున్నారు. ఓం సిటీగా పిలుస్తున్న ఈ ఆధ్మాత్మిక నగరంలో అతిపెద్ద హనుమాన్ విగ్రహాన్ని నిర్మిస్తారు. ఈ విషయాన్ని రామోజీ కుటుంబం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన సందర్భంగా వెల్లడించింది.
రామోజీ, ఆయన కుమారుడు, ఇద్దరు కోడళ్లు కలిసి హైదరాబాద్ లో విడిది చేసిన రాష్ట్రపతిని కలిశారు. ఆయనకు తమ ఓం ప్రాజెక్టు పుస్తకాన్ని అందించారు. ఆ సందర్భంగానే ఈ హనుమాన్ విగ్రహాన్ని గురించి వివరించి దానికి సంబంధించిన చిత్రాలనూ చూపించారట.