డీజీపీని కలిసిన రమ్య ఫ్యామిలీ ..ఎందుకంటే, డీజీపీ ఏంచెప్పారంటే?

Update: 2021-08-24 06:43 GMT
ఓ ప్రేమోన్మాది చేతిలో అత్యంత దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయంలో గౌతం సవాంగ్‌ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఘటన జరిగిన అతి తక్కువ సమయంలోనే, ముద్దాయి శశికృష్ణను ఘటన జరిగిన కొన్నిగంటల్లోనే అరెస్ట్ చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదని రమ్య కుటుంబ సభ్యులు తెలిపారు.

తమ కుటుంబం పైన కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రమ్య కుటుంబ సభ్యులు వాపోయారు.  డబ్బులకు అమ్ముడుపోయా మంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో తమకు భోజనం కూడా చేయాలనిపించడంలేదని రమ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులకు డీజీపీ గౌతం సవాంగ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేసు దర్యాప్తును పోలీసులు వేగంగా పూర్తి చేశారని రమ్య కుటుంబ సభ్యులు చెప్పారని తెలిపారు. రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. వాళ్ల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం. పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రమ్య కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ హత్య కేసు దర్యాప్తును కేవలం ఆరు రోజులోనే పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. కోర్టులో ట్రైల్ కూడా త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్షపడేలా చేస్తామన్నారు. మహిళ భద్రత, రక్షణకు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ అన్నివిధాలుగా రమ్య కుటుంబానికి సహాయసహకారాలు అందిస్తుందని డీజీపీ హామీ ఇచ్చారు.
Tags:    

Similar News