ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అన్ని సామాజిక మాధ్యమాల్లో మోడీ దూకుడు రీతిలోనే..ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జోరు సైతం పెరిగింది. అయితే తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో...ఆయన టీంపై ముఖ్యంగా సోషల్ మీడియా ప్రచారంపై చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ఆన్ లైన్ బ్రాండ్ ఇమేజీ పెంచాలన్న పట్టుదలతో జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పార్టీ సోషల్ మీడియా విభాగం నిర్వహణకు కన్నడ సినీనటి - మాజీ ఎంపీ రమ్యను ఎంపిక చేశారు. అయితే రాహుల్ తాజా బాధ్యతల నేపథ్యంలో రమ్య ఎలాంటి సవాళ్లు ఎదుర్కోనున్నారని చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగాన్ని స్థాపించి ఐదేళ్లపాటు నిర్వహించిన దీపిందర్ హూడా గణనీయమైన ఫలితాలు సాధించలేకపోయారు. దీంతో మరింత ముందుకు తీసుకుపోవడంలో భాగంగా డిజిటల్ కమ్యూనికేషన్స్ విభాగం అధిపతిగా రమ్యకు రాహుల్ స్వయంగా బాధ్యతలు అప్పగించారు. ఆమె సోషల్ మీడియాతో పాటుగా ఐటీ వ్యవహారాలను చూస్తున్నారు. కాంగ్రెస్ ఇటీవలి వరకు సోషల్ మీడియా బీజేపీ అంత యాక్టివ్ గా లేదు అయితే...రమ్య పగ్గాలు చేపట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఆఫీస్ ఆఫ్ రాహుల్ గాంధీ - ఐఎన్ సీ ఇండియాకు ఫోలోవర్స్ పెరిగారు . దీని వెనక హీరోయిన్ రమ్య హస్తమే ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాహుల్ కు సన్నిహితురాలనే పేరున్న రమ్య కొత్త పగ్గాలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ డిజిటల్ మీడియా విభాగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. రమ్య సోషల్ మీడియా ఇన్ చార్జ్ గా బాధ్యతలు చేపట్టకముందు డిజిటల్ వార్ రూమ్ లో కేవలం ముగ్గురే అమ్మాయిలు పనిచేసేవారు. రమ్య వచ్చాక ఆఫీస్ మొత్తం స్టాఫ్ లో 85 శాతం మహిళా ఉద్యోగులే ఉన్నారు. సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్ రూం నుంచే...రమ్య తన టీం ద్వారా ట్వీట్ల వార్ సాగిస్తున్నారు.
రమ్య 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత కర్ణాకటలోని మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరించే రమ్య కాంగ్రెస్ అధిష్టానానికి తక్కువ సమయంలోనే చేరువ అయ్యారు. రాహుల్ సన్నిహితురాలిగా ముద్రపడ్డారు. అనంతరం ఆమెకు డిజిటల్ మీడియా బాధ్యతలు అప్పగించగా...స్వల్పకాలంలోనే మెరుగైన ఫలితాలు చూపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెంచడం - రాహుల్ ట్వీట్లలో కంటెంట్ మెరుగుపడేలా డాటా అందిచడం వంటివన్నీ రమ్య నిర్వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న రమ్య ఈ దారిలో జోరుగా ముందుకు సాగుతున్నారు. అయితే...బీజేపీ - ప్రధాని మోడీని ధీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ సోషల్ మీడియా ఉండేలా చేయడం రమ్యకు ఓ సవాల్ అని నిపుణులు అంటున్నారు. చిన్నపొరపాటు చేసినా అది పార్టీ ఇమేజ్ కు నష్టం చేస్తుందని....నిపుణులైన మోడీ టీంను ఆమె ఏ విధంగా ఎదుర్కుంటారో చూడాలని పేర్కొంటున్నారు.
రమ్య అసలు పేరు.. దివ్య స్పందన. కన్నడ - తెలుగు - మళయాలం - తమిళ సినిమాల్లో నటించారు. కాగా, కొద్దికాలం క్రితం రమ్య వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ కు వెళ్లిన రమ్య అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొని ఇండియాకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ లో పరిస్థితులు బాగున్నాయని, అది చాలా మంచి దేశమని మెచ్చుకున్నారు. పాకిస్తాన్ కు వెళితే నరకానికి వెళ్లినట్లు ఉంటుందని అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పడం సరికాదని ఖండించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది.