సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. పట్టపగలే మహిళలు.. చిన్నారులపై మానభంగాలు జరుగుతున్నా పాలకులకు చలనం లేకుండా పోతుండటం శోచనీయంగా మారింది. మహిళలపై దారుణాలు జరుగడం.. ఆపై పోలీసులు మొక్కుబడిగా విచారణ చేపట్టడం లాంటి సంఘటనలు నిత్యకృత్యాలు గా మారిపోతున్నాయి.
ఓ వ్యక్తి వివాహిత మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా దాన్ని వీడియో తీసి ఆమె భర్తకు పంపించాడు. ఈ సంఘటనతో తన పరువు పోతుందని భయపడిన సదరు వివాహిత భర్త ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. పోలీసులు.. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
మహారాష్ట్ర జల్నా జిల్లాలోని పింపల్గామ్ గ్రామంలో వివాహిత తన భర్తతో కలిసి నివసిస్తుంది. ఆమె భర్త చిరు వ్యాపారి కాగా.. మహిళ ఇంటి పనులు చూసుకుంటే ఉండేది. వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ క్రమంలో వివాహిత చుట్టు పక్కల ఉండే మహిళలు ఆమెతో పరిచయం పెంచుకున్నారు.
ఒకరోజు ఆమె వద్దకు వెళ్లి మీ రవి దత్తాత్రేయ అనే వ్యక్తి మీ వ్యాపారికి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నమ్మించారు. నువ్వు వెళ్లి అతడితో మాట్లాడితే డబ్బులు ఇస్తాడని ఆమె తోటి మహిళలు సలహా ఇచ్చారు. దీంతో ఆ మహిళ రవి దత్తాత్రేయకు ఫోన్ చేయగా అతడు ఆమె ఇంటికి అనుచరులతో కలిసి వచ్చాడు.
అనంతరం మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను ఫోన్లో రికార్డు చేశాడు. అలాగే బాధిత మహిళతో అసభ్యంగా మాట్లాడిన సంభాషణను రికార్డు చేసి ఆమె భర్తకు పంపించాడు. ఈ వీడియో చూసిన వివాహిత భర్త తన పరువు పోతుందనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివాహిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళలు ఎవరిని పడితే వారి నమ్మి మోసపోవద్దని పోలీసులు సలహా ఇస్తుండటం కొసమెరుపు. కాగా ఆ దంపతులకు రెండేళ్ల క్రితమే వివాహం కావడం గమనార్హం. ఈ సంఘటనలో బాధిత మహిళకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.