అత్యాచార బాధితురాలికి.. 5 ల‌క్ష‌ల 50 వేలు..

Update: 2021-06-21 11:30 GMT
ఏపీలోని గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాసానికి కూత వేటు దూరంలో ఉన్న కృష్ణాన‌ది పుష్క‌ర్‌ఘాట్‌లో అత్యాచారానికి గురైన యువ‌తిని రాష్ట్ర హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వ‌నిత.. ప‌రామ‌ర్శిం చారు. అత్యంత ర‌హ‌స్యంగా బాధితురాలి వ‌ద్ద‌కు వ‌చ్చిన మంత్రులు.. క‌నీసం మీడియాకు కూడా ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌క‌పోవ డం గ‌మ‌నార్హం. త‌న‌కు కాబోయే భ‌ర్త‌తో క‌లిసి..పుష్క‌ర‌ఘాట్‌కు వ‌చ్చి.. కొద్దిసేపు మాట్లాడుకోవాల‌ని భావించిన యువ‌తిపై కొంద‌రు వ్య‌క్తులు దాడి చేశారు.

ప‌రిహారం అందుకే!

ఆమెకు కాబోయే భ‌ర్త‌ను తాళ్ల‌తో క‌ట్టేసి.. అత‌ని ముందే.. రేప్ చేశారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌రామ‌ర్శించ‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించ‌డంతో తాము వ‌చ్చి.. బాధితురాలిని ప‌రామ‌ర్శించిన‌ట్టు మంత్రులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా హోం మంత్రి సుచ‌రిత మాట్లాడుతూ.. బాధితురాలికి ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌లు సాయం ప్ర‌క‌టించిన‌ట్టు తెలిపారు. అయితే.. ఇది సాయం మాత్ర‌మేన‌ని.. ఆమెకు జ‌రిగిన అన్యాయంపై పూర్తిగా విచార‌ణ చేప‌ట్టి న్యాయం చేస్తామ‌ని.. పోలీసులకు సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే స్వ‌యంగా ఆదేశాలు జారీ చేశార‌ని తెలిపారు. దిశ యాప్‌ను యువ‌తులు డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు.

అందుకే బ‌య‌ట‌కు రావ‌ట్లేద‌ట‌!

మంత్రి తానేటి వ‌నిత మాట్లాడుతూ.. త‌మ శాఖ త‌ర‌ఫున బాధితురాలికి రూ.50 వేలు సాయం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పేర్కొన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. అయితే.. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా మంత్రులు ఎందుకు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటున్నార‌న్న మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్న‌కు వ‌న‌తి త‌డ‌బ‌డ్డారు. దీనికి కార‌ణం చెప్పేందుకు వెతుక్కున్నారు. గ‌త ఏడాది క‌రోనా వ‌చ్చింద‌ని, దీంతో దూరంగా ఉన్నామ‌ని.. త‌ర్వాత‌.. ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చింద‌ని.. ఇది అయ్యేలోగా మ‌ళ్లీ.. సెకండ్‌వేవ్ క‌రోనా వ‌చ్చింద‌ని.. అందుకే తాము.. ప్ర‌జ‌ల్లోకి రాలేద‌ని చెప్పారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

డీజీపీ రియాక్ష‌న్ ఇదే..

ఇక‌, అత్యాచారం ఘ‌ట‌న‌లో విజ‌య‌వాడ‌కు చెందిన రాంకీని అదుపులోకి తీసుకున్న‌ట్టు పోలీసులు ప్ర‌క‌టించారు. ఈ విష‌యంపై తాజాగా డీజీపీ గౌతం స‌వాంగ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటున్నామ‌న్న ఆయ‌న‌.. ఇప్ప‌టికే గుంటూరు, విజ‌య‌వాడ పోలీసుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్టు తెలిపారు. నాలుగు ప్ర‌త్యేక పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు వివ‌రించారు.
Tags:    

Similar News