కరోనా పరీక్షల్లో ఏపీ దేశంలోనే రికార్డులు బద్దలు కొడుతోంది. నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా చేస్తోంది. ఒక్కరోజులోనే ఏకంగా 28,239 టెస్టులు చేశారు. మొత్తం పరీక్షలు 9,18,429కి చేరాయి. గడిచిన 24 గంటల్లోనే వ్యాధి నుంచి కోలుకొని 477మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా ఏపీలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6988కు చేరింది.
ఏపీలో కొత్తగా 657 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15252కి చేరింది. వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 2036 ఉండగా.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 736గా ఉంది.కరోనాతో మరణించిన మొత్తం సంఖ్య 193కి చేరింది.
తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఆయనతోపాటు గన్ మెన్, ఇద్దరు కుటుంబ సభ్యులకూ వైరస్ సోకినట్టు సమాచారం. ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగిన 16మందికి బుధవారం టెస్టులు నిర్వహించారు. రిపోర్టులు వస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.