బెంబేలెత్తించిన కొత్త వ్యాధి.. పసుపు రంగులోకి మారిన చిన్నారి..

Update: 2021-07-25 08:21 GMT
వైద్య శాస్త్రంలో పురోగ‌మిస్తున్న తీరుకు స‌మానంగా.. నూత‌న‌ ఆవిష్క‌ర‌ణ‌ల‌కు స‌మాంత‌రంగా.. స‌రికొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మ‌నిషి విజ్ఞానాన్ని స‌వాల్ చేస్తున్నాయి. క‌రోనా ముందు వ‌ర‌కూ ఎన్నో ర‌కాల రోగాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. పెద్ద‌గా భ‌య‌ప‌డ‌ని మ‌నిషి.. కొవిడ్ రాక‌తో వ‌ణికిపోతున్నాడు. ఏ కొత్త వ్యాధి క‌నిపించినా.. వినిపించినా.. బెంబేలెత్తి పోతున్నాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే కెన‌డాలో ఓ అరుదైన వ్యాధి క‌ల‌క‌లం రేపింది.

ఆ దేశంలోని 12 ఏళ్ల బాలుడి నాలుక ఉన్న‌ట్టుండి ప‌సుపు వ‌ర్ణంలోకి మారిపోవ‌డం మొద‌లు పెట్టింది. అంతేకాకుండా.. గొంతులో నొప్పి, క‌డుపు నొప్పి, చ‌ర్మం రంగులోనూ మార్పు రావ‌డంతో.. త‌ల్లిదండ్రులు హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు.. దాన్ని ‘కోల్డ్ అగ్లుటినిన్’ అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు.

ఈ వ్యాధి వచ్చిన వారిలో వింత పరిస్థితి ఎదురవుతుంది. అతని రోగ నిరోధక శక్తే.. అతనిపై దాడి చేస్తుంది. శరీరంలోని ఎర్రరక్తకణాలపై రోగ నిరోధక శక్తి దాడిచేసి, చంపేస్తుంది. అలా.. రెడ్ సెల్స్ నాశనం కావడంతో.. నాలుక, చర్మం పసుపు వర్నంలోకి మారిపోతుందట.

అమెరికాలోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్ర‌కారం.. ఈ కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వ‌ల్ల ఎర్ర ర‌క్త‌క‌ణాలు వేగంగా విచ్ఛిన్నం అవుతాయ‌ట‌. అంతేకాకుండా.. ర‌క్తహీన‌త ఏర్ప‌డి, కామెర్లు కూడా వ‌స్తాయ‌ట‌. దీనికి సంబంధించి జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నా బాలుడికి ఏకంగా ఏడు వారాలపాటు స్టెరాయిడ్ల‌ను ఉప‌యోగించార‌ని తెలిపింది. మొత్తానికి ఆ బాలుడు ఈ వ్యాధి బారి నుంచి బ‌య‌టప‌డి క్షేమంగా ఇల్లు చేరాడ‌ని జ‌ర్న‌ల్ ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News