సాకు చెప్పాలంటే మన అధికారుల తర్వాతే.. అని చెప్పడానికి మరో ఉదాహరణ దొరికింది! ఢిల్లీలో రోజు రోజుకీ దోమల బెడద బాగా పెరిగిపోతుంది. దోమల కారణంగా వస్తున్న డెంగీ ఫీవర్.. ఢిల్లీ వాసులను కుదేలుచేస్తుంది. ఈ ఏడాది సుమారు 780 డెంగీ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఏడాది సంగతంతా పక్కన పెడితే... కేవలం గత వారం రోజుల్లోనే సుమారు 250 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో ఢిల్లీ నగరవాసులు దోమల బారిన పడుతున్నారు... అది వేసే కాటుతో డెంగీ జ్వరాలపాలవుతున్నారు.
ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఏమిచేస్తున్నారు అనుకుంటున్నారా? సాకులు వెతుకుతున్నారు! నిజంగా ఆ సాకు నిజమే అయితే... సమస్య తెలిసిన తర్వాత కూడా పరిష్కరించడానికి ఏమి ప్రయత్నాలు చేశారయ్యా అంటే... కంప్లైంట్ ఇచ్చారట! తాజాగా ఢిల్లీలో పెరిగిపోతున్న దోమలకు రాష్ట్రపతి భవన్ కారణం అని తేల్చేశారు ఢిల్లీ మున్సిపల్ అధికారులు. అదేమిటి రాష్ట్రపతి భవన్ కి ఢిల్లీలో డెంగ్యూ కీ ఏమిటి సంబందం అంటే... రాష్ట్రపతి భవన్ లో విశాలమైన తోట ప్రాంతం ఉంది. ఈ తోట ప్రాంతం వల్లే దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని చెబుతున్నారు!
అందుకే.. ఇప్పటికే రాష్ట్రపతి భవన్ కు "తోటలో దోమలు ఉన్నాయి, వాటిని నివారించాలని" సుమారు 80సార్లు నోటీసుకులు కూడా ఇచ్చారట. అయినా కూడా రాష్ట్రపతి భవన్ సిబ్బంది పట్టించుకోవడం లేదని చెబుతున్నారు! సమస్య చాలా జఠిలంగానే ఉంది సుమా...