హైదరాబాదు లో రేవ్ పార్టీ - మీడియా ను బూతులు తిట్టిన యువతులు

Update: 2020-01-13 03:52 GMT
పార్టీ చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఇతరుల ఆనందాన్ని హరించి పార్టీ చేసుకోవాలనుకుంటే ఇరుక్కోక తప్పదు. హైదరాబాదులోని ఓ పబ్బులో పార్టీ చేసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన యువతీయువకులను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో శృతి మించిన డీజేతో ఇరుగు పొరుగు ఇబ్బంది పడే స్థాయిలో పార్టీ చేసుకోవడంతో కొందరు పోలీసులకు కంప్లయింట్ చేశారు. న్యూసెన్స్ ఫిర్యాదు కింద భావించిన పోలీసులకు అక్కడికి వెళ్లాక పరిస్థితి తీవ్రత అర్థమైంది. దీంతో ఎక్సైజ్ పోలీసులను కూడా పిలిపించి సంయుక్తంగా పబ్ పై దాడి చేశారు. లోపల విచ్చలవిడిగా రేవ్ పార్టీ చేసుకుంటున్న విషయం బయట పడింది. అక్కడ 20 మంది యువతులు 60 మంది ఇతరులు ఉన్నారు. పార్టీని భగ్నం చేసిన పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా యువతులు హంగామా సృష్టించారు. పోలీసులు వారి మొహాలను కవర్ చేసే ప్రయత్నం చేశారు. అంతలోపు మీడియా వారిని చిత్రీకరించడం తో ఊగి పోయిన యువతులు మీడియా ప్రతినిధులను బూతులు తిట్టారు. కెమెరాలను పగలగొట్టే ప్రయత్నం చేశారు. కొందరి ఫోన్లను కూడా లాక్కున్నారు. వీకెండ్ లో పార్టీలు మామూలే గాని మరీ ఈ స్థాయిలో బయట వారిని డిస్టర్బ్ చేసేంతగా పబ్ లో జరగడం అరుదు. పైగా  సాధారణంగా ఎవరికీ తెలియకుండా నగర శివారల్లో నిర్వహించే  రేవ్ పార్టీని బరితెగించి నగర నడి బొడ్డున ఉన్న పబ్ లో నిర్వహించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికి పోయారు. సంక్రాంతి మూడ్లో సిటీ అంతా ఖాళీ అయ్యిందని కాబోలు పార్టీ సిటీ సెంటర్లో పెట్టేసుకున్నారు.
Tags:    

Similar News