తెలుగుదేశం ప్రభుత్వంపై వరుసపెట్టి విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలపై టీడీపీ మంత్రులూ ఎదురుదాడి ప్రారంభించారు. వినీవిననట్లుగా వదిలేస్తున్నా కూడా బీజేపీ నేతల నోటికి అడ్డుకట్టపడకపోవడంతో ఇక ఎదురుదాడే బెటరన్న నిర్ణయానికి వచ్చారు. అయితే... బీజేపీ నేతల విమర్శలు ఆ పార్టీవి కావని... ఆ వ్యక్తులవే కాబట్టి వారినే అటాక్ చేస్తామని అంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు బీజేపే నేత కన్నా లక్ష్మీనారాయణపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారని, సైకిల్ దుకాణానికి యజమాని కొడుకు ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న సమయంలో కన్నా అక్రమాలకు అడ్డేలేకుండా పోయిందని.. ఇప్పుడు అధికారం లేకపోవడంతో ఆయనకేమీ తోచక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు - కావూరి సాంబశివరావు - కన్నా లక్ష్మీనారాయణ తదితరులు చేస్తున్న విమర్శలను వారి వ్యక్తిగతమైనవిగానే చూస్తాము తప్ప బీజేపీ అభిప్రాయంగా చూడలేమన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి, సంక్షేమాల దిశగా దూసుకుపోతుంటే పనిలేని పార్టీలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులోనూ రాష్ట్రంలో సింగిల్ పార్టీ.. అదీ సింగపూర్ తరహా పాలన కొనసాగుతుందని మంత్రి జోస్యం చెప్పారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై ప్రశ్నించగా ప్రజల అభీష్టం మేరకే ఏపనైనా చేస్తామని.. బాక్సైట్ తవ్వకాల విషయంలో కూడా గిరిజనులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టబోమని మంత్రి అన్నారు.