టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణ ఎపిసోడ్ మలుపు తిరుగుతోంది. నిధుల దుర్వినియోగం - అక్రమాల ఆరోపణలు ఎదుర్కుంటున్న రవిప్రకాశ్ ఏపీలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి జంప్ అయినట్టు సైబరాబాద్ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏపీ నుంచి మరో ప్రాంతానికి జారుకొన్నట్టు సైబర్ క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ గురించి గాలింపును పోలీసులు ముమ్మరం చేశారు. గురువారం ఏపీ రాష్ట్ర - లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం రవిప్రకాశ్ తన అడ్డాను ఏపీ నుంచి మార్చేసుకొన్నట్టు పోలీసులకు సమాచారం అందినట్టు తెలిసింది.
ఈ పరిణామంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రవిప్రకాశ్ - శివాజీపై నమోదైన రెండు కేసుల విచారణ వేగవంతం కానుందని అంటున్నారు. ఇప్పటికే పోలీసులు జారీచేసిన 160 సీఆర్ పీసీ - 41-ఏ సీఆర్ పీసీ నోటీసులను తీసుకొనేందుకు నిరాకరించిన రవిప్రకాశ్ - శివాజీ చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. చట్టంలో ఉన్న అంశాలకు అనుగుణంగా పోలీసులు ముందుకు సాగుతుండటంతో రవిప్రకాశ్ - శివాజీ అరెస్టు తప్పనిసరిగా మారింది. మరోవైపు టీవీ9 మాజీ సీఎఫ్ వో మూర్తి గురువారం 12వ రోజు విచారణకు హాజరయ్యారు. రవిప్రకాశ్ కోసం సైబరాబాద్ సైబర్ క్రైంకు చెందిన మూడు బృందాలు గాలిస్తున్నాయి.