స్థాయి తక్కువేం కాదు. ఏకంగా కేంద్రమంత్రి. అలాంటి స్థానంలో ఉన్న వారి నోటి నుంచి రాకూడని మాటల్ని మాట్లాడి.. ఇవేం లెక్కలు బాబు అన్నట్లుగా మరారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. ఇటీవల విడుదలైన మూడు సినిమాలు రూ.120 కోట్ల చొప్పున వసూళ్లు సాధిస్తున్న వేళ.. దేశంలో మాంద్యం ఎక్కడ ఉందన్న ప్రశ్న వేసి అవాక్కు అయ్యేలా చేశారు.
కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఆయన సొంత తెలివి కంటే కూడా మీడియాలో వచ్చిన వార్త ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇటీవల పీవీఆర్ మల్టీఫ్లెక్స్ ఎండీ ఒక సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో మాంద్యం ఉందేమో కానీ.. తమ వ్యాపారానికి ఎలాంటి దెబ్బ లేదని చెప్పారు. తమ బిజినెస్ మస్తుగా నడుస్తున్నట్లు చెప్పటమే కాదు.. గత ఏడాదితో పోలిస్తే..తమ ఆదాయం ఎంత పెరిగిందో తెలుసా? అంటూ లెక్కలు చెప్పారు.
ఆ సమయంలో దేశ ప్రజలు సినిమాలు మరిన్ని చూడటం ద్వారా మాంద్యాన్ని తరిమేయొచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. చూస్తుంటే.. ఆయన మాటల ప్రభావం కేంద్రమంత్రి మీద పడినట్లుగా కనిపిస్తోంది. దసరా సందర్భంగా విడుదలైన వార్.. సైరా.. జోకర్ సినిమాలు భారీ ఎత్తున వసూళ్లు రాబడుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో మాంద్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పటానికి సినిమా కలెక్షన్లు చూస్తే తెలిసిపోవటం లేదని ఎదురు ప్రశ్నించారు.దేశంలో సంక్షోభాలే లేవని.. సుభిక్షంగా ఉందన్న ఆయన.. తన మాటలకు తగినట్లు అర్థవంతమైన కొన్ని అంకెల్ని చెప్పి ఉంటే బాగుండేదేమో? అందుకు భిన్నంగా సినిమా కలెక్షన్లను చెప్పి మాంద్యం లేదనటంపై పలువురు తప్పు పడుతున్నారు.