హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ర్టాలకు సేవలు అందిస్తున్న ఉమ్మడి హైకోర్ట్ విషయంలో తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ పార్లమెంటు సాక్షిగా వినిపించిన గళం సందర్భంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు తాము అనుకున్న డిమాండ్‌పై ప్రకటన రాబట్టుకోగా...ఏపీలో అధికార పార్టీ ఎంపీ అయిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఊహించని పంచ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రత్యేక హైకోర్టు అంశంపై బుధవారం టీఆర్ ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ లోక్ సభను అడ్డుకోవడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. గురువారం లోక్ సభ జీరో అవర్ ప్రారంభం కాగానే టీఆర్ ఎస్ పక్షనేత ఏపీ జితేందర్ రెడ్డి.. ప్రత్యేక హైకోర్టు అంశంపై న్యాయశాఖ మంత్రి ప్రకటన చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతితో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటన చేశారు.
అయితే...హైకోర్టు విభజన అంశంపై టీఆర్‌ఎస్ పక్షనేత ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. `మీరు కేంద్ర మంత్రి. అది దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి` అని చురకలు అంటించారు. దీంతో అవాక్కైన సుజనా చౌదరి వెంటనే సర్దుకున్నారు. హైకోర్టుతో పాటు ఇతర విభజన హామీలను ప్రస్తావించారు. హైకోర్టు విభజన అంశంతోపాటు విజభన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్ర హోంమంత్రి స్పష్టత ఇవ్వాలని సుజనా చౌదరి కోరారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ హైకోర్టు విభజన మినహా - విభజన చట్టంలో పేర్కొన్న ఇతర అంశాల పరిష్కారంపై ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవాలని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
కాగా, తాత్కాలిక భవనాలు అందుబాటులోకి రాగానే - హైకోర్టును ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తామని కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. `ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టు శాశ్వతంగా తెలంగాణ హైకోర్టుగా కొనసాగుతుంది. అప్పటివరకు ఇరు రాష్ర్టాలవారు సమన్వయంతో వ్యవహరించాలని కోరుతున్నా` అని రవిశంకర్ ప్రసాద్ కోరారు. కేంద్రమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నట్టు ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు కోసం తాత్కాలికంగా నాలుగు భవనాలు చూపించడం, అందులోకి ఏపీ హైకోర్టును తరలిస్తున్నందుకు ఏపీ సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. హైకోర్టు తరలింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు న్యాయమూర్తులకు పదోన్నతులు ఇవ్వొద్దని జితేందర్ రెడ్డి కోరారు. పదోన్నతులిస్తే తెలంగాణ న్యాయవాదులకు - జడ్జిలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని వివరించారు. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అయితే, జడ్జిల నియామకం హైకోర్టు - సుప్రీంకోర్టుల కొలీజియంలు నిర్ణయిస్తాయని, ఈ అంశంలో తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.