డబుల్ సెంచరీ ఫీట్ సాధించిన రవీంద్ర జడేజా

Update: 2019-10-04 11:53 GMT
టీమిండియాకు రవీంద్ర జడేజా ఎంత కీలకమో తెలిసిందే. బౌలింగ్ తోనే కాదు బ్యాటింగ్ తో కూడా ప్రత్యర్థులను హడలెత్తిస్తాడు. ఇక ఫీల్డింగ్ లో అయితే అతని విన్యాసాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అందుకే టీమిండియాలో ఇప్పుడు రవీంద్ర జడేజా నెంబర్ 1 అల్ రౌండర్. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో రవీంద్ర జడేజా ఒక రేర్ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా రికార్డులకెక్కాడు.

ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక బౌలర్ హెరాత్ పేరు మీద ఉండేది. హెరాత్ 47 టెస్టుల్లో 200 వికెట్లు తీశాడు. కానీ మన రవీంద్ర జడేజా 44 టెస్టుల్లోనే ఆ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఈ ఇద్దరి తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ (49) టెస్టులు -  మిచెల్ స్టార్క్ (50) టెస్టులు - ఇండియా మాజీ ఆటగాడు బిషన్ సింగ్ బేడీ - పాకిస్థాన్ ఆటగాడు వసీం అక్రమ్ (51) టెస్టులతో  తర్వాత స్థానాల్లో ఉన్నారు.
Tags:    

Similar News