మిత్రధర్మాన్ని మరిచి..ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న ఏపీ కమలనాథుల మీద తెలుగు తమ్ముళ్లు స్వరం పెంచారు. నిధులు ఇవ్వకుండా.. మొండి చేయి చూపిస్తున్నప్పటికీ అధినాయకుడి మాటతో నోరు మూసుకొని ఉంటున్నారు ఏపీ తమ్ముళ్లు. ఓ పక్క కొన్ని రాష్ట్రాలకు రూ.1.10లక్షల కోట్ల ప్యాకేజీ.. రూ.80వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి.. మరోపక్క విభజనతో అన్యాయానికి గురైన ఏపీకి మాత్రం గుండు సున్నా పెడుతున్న కేంద్ర వైఖరిపై రగిలిపోతున్నా.. నోరు విప్పని పరిస్థితి. తాము ఎంత తగ్గితే.. అంతగా చెలరేగిపోతున్న కమలనాథులపై ఏపీ అధికారపక్ష నేతలు తమ ఆవేశాన్ని మనసులోనే దాచి పెట్టుకుంటున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా బీహార్ ఫలితాల ప్రభావమో.. లేక ఇలాంటి సమయంలో నాలుగు మాటలు అన్నా బాగుంటుందని అనుకున్నారేమో కానీ.. తెలుగుదేశం నేతలు కమలనాథులపై చెలరేగిపోయారు. తాజాగా సీమాంధ్రకు చెందిన సీనియర్ నేత.. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కమలనాథులపై తీవ్రస్థాయింలో ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజల ఊసురు తగిలే బీహార్ లో బీజేపీ ఓడిపోయిందని విరుచుకుపడ్డారు. బీహార్.. కాశ్మీర్ లకు లక్షల కోట్ల ఇస్తున్న మోడీ.. సీమాంధ్రులకు మాత్రం రిక్త హస్తం చూపుతున్నారన్నారు.
ఏపీ శంకుస్థాపన సమయంలో అతిధిగా వచ్చిన ప్రధాని మోడీ.. యమునా నదినీళ్లు.. పార్లమెంటు ఆవరణ నుంచి మట్టిని తెచ్చి ఇచ్చి వెళ్లి పోయారంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి చెంబుడు నీళ్లు.. పిడికెడు మట్టి తెచ్చారన్నారు. నిన్నమొన్నటి వరకూ తమ్ముళ్లపై కమలనాథులు కస్సుమంటే.. తాజాగా టీడీపీ నేతలు కమలనాథులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరి.. రెండు పక్షాల మధ్య నడుస్తున్న మాటల దాడి ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.